
ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా జైలర్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన వినాయకన్ కు మంచి పేరు వచ్చింది. ఆయన నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. జైలర్ సినిమాలో విలన్ అయిన వినాయకన్ నిజ జీవితంలో కూడా విలన్ పోకడలు ప్రదర్శించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మద్యం తాగి రచ్చ రచ్చ చేశాడు మన జైలర్ విలన్. దాంతో పోలీసులు పట్టుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో దురుసుగా ప్రవర్తించినందుకు వినయగన్‌ను కేరళలోని నార్త్ ఎర్నాకులం పోలీసులు అరెస్ట్ చేశారు.
వినాయకన్ పై ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వినాయకన్ నివసించే అపార్ట్‌మెంట్ వాసులు ఆయన పై ఆరోపణలు చేశారు. అర్థరాత్రి పార్టీలు, ఎక్కువ శబ్దాలు చేస్తూ నాన్సెన్స్ చేస్తున్నాడని ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ కారణంగానే పోలీసులు వినాయకన్ కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు. దాంతో పాటు మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన నటుడు వినాయకన్.. పోలీస్ స్టేషన్‌లో దురుసుగా ప్రవర్తించడంతోపాటు పోలీస్ స్టేషన్‌లోని అధికారులను దుర్భాషలాడాడు.
పోలీస్ స్టేషన్‌లో రచ్చ చేయడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వినాయకన్ పోలీసులు తీసుకెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైడ్ డ్యాన్సర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వినాయకన్ ఇప్పుడు ప్రముఖ విలన్ గా రాణిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆయన నటించిన ‘కపాటిపదం’ చిత్రం వినాయకన్ కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్‌గా నటించాడు వినాయకన్. ఇటీవల ‘జైలర్’ సినిమాలో వర్మ పాత్రలో వినాయకన్ కు మంచి ప్రశంసలు దక్కాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న చియాన్ విక్రమ్ నటించిన ‘ధృవ నాచత్తిరమ్’లో కూడా వినాయకన్ నటించారు. మలయాళంలో ‘కరింతందన్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు.