ఓరిని దుంప తెగ..! ఫుల్‌గా మందుకొట్టి పక్కింటోళ్లతో గొడవపెట్టుకున్న జైలర్ విలన్

మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు వినాయకన్ తన దురుసు ప్రవర్తనతో పదే పదే వార్తల్లో నిలుస్తున్నాడు. రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, విశాల్, మమ్ముట్టి, మోహన్‌లాల్, ధనుష్ వంటి పెద్ద నటులతో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ట్యాలెంటెడ్ నటుడు నిజ జీవితంలోనూ విలన్ గా ప్రవర్తిస్తున్నాడు.

ఓరిని దుంప తెగ..! ఫుల్‌గా మందుకొట్టి పక్కింటోళ్లతో గొడవపెట్టుకున్న జైలర్ విలన్
Jailer Villain

Updated on: Jan 21, 2025 | 12:32 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ తో పాపులర్ అయ్యాడు టి.కె.వినాయకన్. అంతకు ముందు చాలా సినిమాల్లో విలన్  గ్యాంగ్ లో నటించాడు. అలాగే కొన్ని సినిమాల్లో మెయిన్ విలన్ గానూ నటించాడు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమాలో వినాయకన్ మెయిన్ విలన్ గా నటించాడు. అంతే కాదు ఈ సినిమాలో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వినాయకన్ విలన్ గా బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మద్యానికి బానిసైన వినాయకన్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. సినిమా ఆఫర్స్ కూడా రాకపోవడంతో అతను తాగి అందరితో గొడవలు పెట్టుకుంటున్నాడు.

మొన్నటికి మొన్న గోవాలో ఓ షాప్ ఓనర్ తో గొడవపడుతూ హల్ చల్ చేశాడు. తాజాగా ఫుల్లుగా మద్యం సేవించి పక్కింటి వాళ్ళతో గొడవ పడ్డాడు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫుల్ గా మద్యం సేవించి ఇంటి బాల్కనీ నుంచి పక్క ఇంటి వారి పై అరుస్తూ కేకలు వేస్తూ వీరంగం సృష్టించాడు. ఒంటి మీద సోయి లేకుండా ప్రవర్తించాడు వినాయకన్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ వినాయకన్ పై మండిపడుతున్నారు.

2023 అక్టోబర్ లో కూడా వినాయకన్ ఫుల్లుగా తాగేసి పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేస్తున్నాడని ‘పబ్లిక్ వయోలేషన్’ సెక్షన్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గోవాలో గొడవపడుతూ కనిపించాడు. ఇక ఇప్పుడు మరోసారి ఇలా పక్కింటివారితో గొడవపడుతూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.