Thalapathy vijay: వారసుడి కోసం కథలు వింటోన్న దళపతి విజయ్..

తమిళ్ స్టార్ హీరోల్లో ముందు వరసలో ఉంటారు దళపతి విజయ్. ఆయన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Thalapathy vijay: వారసుడి కోసం కథలు వింటోన్న దళపతి విజయ్..
Thalapathy Vijay

Updated on: Jun 21, 2022 | 8:50 AM

తమిళ్ స్టార్ హీరోల్లో ముందు వరసలో ఉంటారు దళపతి విజయ్(Thalapathy vijay). ఆయన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ విజయ్ కు మంది ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో విజయం సాధించినప్పటికీ తెలుగులో పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచుకున్నప్పటికీ అది దళపతి ఫ్యాన్స్ కు సరిపోలేదు. దాంతో ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సరసన లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ కుమారుడికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.

విజయ్ తనయుడు జాసన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. జాసన్ ఎంట్రీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాదిలో జాసన్ ఎంట్రీ పక్కా అనే టాక్ వినిపిస్తోంది. కొడుకు కోసం విజయ్ కథలు కూడా వింటున్నారట. మంచి కథ ఫిక్స్ అయితే జాసన్ ఎంట్రీ సాలిడ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట విజయ్. కొత్త దర్శకుల దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకూ అందరితో విజయ్ సంప్రదింపులు జరుపుతున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి