విజయ్ సేతుపతి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ నటుడే అయినా.. తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి. హీరోగానే కాకుండా విలన్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే ఉప్పెన సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి. అలాగే విజయ్ సేతుపతి నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది మహారాజ సినిమా.
ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్నారు విజయ్ సేతుపతి. దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో.. 2023లో విడుదలైన చిత్రం విడుదల 1. ఈ చిత్రంలో నటుడు సూరి, భవాని శ్రీతో పాటు విజయ్ సేతుపతి నటించారు. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా విడుదల 2 త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంలో, సినిమా విడుదల పార్ట్ 2 ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవానీ శ్రీ, గౌతం వాసుదేవ్ మీనన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సినిమా త్వరలో విడుదల కానుండగా, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో, హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు విజయ్ సేతుపతి సినిమా గురించి మాట్లాడిన మాటలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో అభిమానులు విజయ్ సేతుపతిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు విజయ్ కు కోపం వచ్చింది. “మీ యూత్ సీన్స్ కోసం డి-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు, ఇది నిజమేనా.?” అని ప్రశ్న అడిగాడు ఓ ఫ్యాన్స్. దీనికి విజయ్ రెస్పాండ్ అవుతూ..”దానికి అర్థం ఏమిటి.? నా సినిమా చూసి మీకు నచ్చిందో లేదో చెప్పండి అంతే. సినిమాల్లో ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించి తీస్తారు. అయితే ఆ విషయాలు ప్రేక్షకులకు ఎందుకు తెలియాలి.? అని విజయ్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.