Vijay Deverakonda: మాట నిలబెట్టుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఆ 100 మందిని ఎక్కడికి పంపిస్తున్నారంటే..

|

Jan 08, 2023 | 10:50 AM

ఐదేళ్ల కిందట దేవర శాంటా పేరుతో ఒక ట్రెడిషన్ స్టార్ చేసిన విజయ్.. ప్రతి ఏడాది భిన్నరకాల ఐడియాస్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే.. ఓ 100 మందిని హాలీడేకి పంపనున్నారు

Vijay Deverakonda: మాట నిలబెట్టుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఆ 100 మందిని ఎక్కడికి పంపిస్తున్నారంటే..
Vijay Deverakonda
Follow us on

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ప్రతి క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు కానుకలు ఇస్తున్నారు. ఐదేళ్ల కిందట దేవర శాంటా పేరుతో ఒక ట్రెడిషన్ స్టార్ చేసిన విజయ్.. ప్రతి ఏడాది భిన్నరకాల ఐడియాస్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే.. ఓ 100 మందిని హాలీడేకి పంపనున్నారు. అందుకు సంబంధించిన ఖర్చులను తనే భరిస్తాడు. డెస్టినేషన్ సెలెక్ట్ చేసేందుకు హెల్ప్ చేయండి అంటూ క్రిస్మస్ రోజు ఓ వీడియో పోస్ట్ చేస్తూ విజ్ఞప్తి చేశారు విజయ్. ఇక ఇప్పుడు ఆ హాలీడే ట్రిప్ గురించి అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు.

ఈ ఏడాది తన అభిమానులు 100 మందిని మనాలికి 5 రోజుల ట్రిప్ పంపనున్నట్లు వీడియోలో వెల్లడించాడు విజయ్. “నేను మీలో 100 మందిని మనాలికి 5 రోజుల ట్రిప్ కు పంపుతున్నాను. మీరు మంచుతో కూడిన పర్వతాలను చూడబోతున్నారు. మఠాలు కూడా చూడొచ్చు. మీకోసం అన్ని ప్లాన్స్ చేసాము. 18 సంవత్సరాలకు పైగ వయసున్నవారు.. ఫారమ్ కంప్లీట్ చేసి నన్ను ఫాలో అవ్వండి. మీలో 100 మందిని ఎంపిక చేస్తాము.. మీ ప్రయాణంలో నేను భాగం కావాలనుకుంటున్నాను. 100 మంది మౌంటెన్స్ వద్దకు వెళ్లండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చారు విజయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో సమంత కథానాయికగా నటిస్తుంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.