AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Movie: కమల్ హాసన్‏లో శతావతారాలు కనిపిస్తున్నాయి.. వెంకటేష్ కామెంట్స్ వైరల్..

క‌మ‌ల్ సార్ విక్ర‌మ్ ఫంక్ష‌న్‌ కు ర‌మ్మ‌న్నారు అంటే రాకుండా ఎవ‌ర‌న్నా వుంటారా? అంతేగా! అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజ‌ప‌రిచారు.

Vikram Movie: కమల్ హాసన్‏లో శతావతారాలు కనిపిస్తున్నాయి.. వెంకటేష్ కామెంట్స్ వైరల్..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2022 | 5:45 PM

Share

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం విక్రమ్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అంతేకాకుండా.. తమిళ్ స్టార్ హీరో సూర్య ఈ మూవీలో(Vikram) కీలకపాత్రలో నటిస్తుండడంతో విక్రమ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. స్టార్ హీరోస్ కలిసి నటిస్తోన్న ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ సినిమా పై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విక్రమ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. మంగళవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన వెంకటేష్ (Venkatesh).. కమల్ హాసన్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా వెంక‌టేష్ మాట్లాడుతూ.. క‌మ‌ల్ సార్ విక్ర‌మ్ ఫంక్ష‌న్‌ కు ర‌మ్మ‌న్నారు అంటే రాకుండా ఎవ‌ర‌న్నా వుంటారా? అంతేగా! అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజ‌ప‌రిచారు. క‌మ‌ల్‌ సార్ న‌ట‌న‌కు 60 ఏళ్ళు. కానీ మ‌న‌స్సు 16 ఏళ్ళ వ‌య‌స్సు.. కమల్‌ గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్‌ బౌల్డ్ అయ్యాను. ఆయ‌న మాత్రం ఇంకా 16 ఏళ్ళ వ‌య‌స్సులో వుండిపోయారు. ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌ కు జీపీఎస్‌. లాంటి సినిమా. ఇక ‘దశావతారం’ చూస్తే అలాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌ కూ ధైర్యం సరిపోదు. ఆయ‌న నాకు అపూర్వ స‌హోద‌రులు.లాంటివారు. ‘ఏక్‌ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఈ రోజు కమల్‌ గారు గ్లోబల్‌ స్టార్‌. క‌మ‌ల్ సార్ లో యూనిక్ క్వాలిటీ వుంది. కె.విశ్వ‌నాథ్‌, బాల‌చంద‌ర్ వంటివారే కాదు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్లు, యంగ్ డైరెక్ట‌ర్లు ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతారు. నాయ‌గ‌న్ సినిమా ఆయ‌న న‌ట‌న‌కే నాయ‌గ‌న్ చేసేసింది. ద‌క్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌ గారికి ముందు.. మరొకటి కమల్‌ గారు వచ్చిన తర్వాత. ఆయ‌న వ‌చ్చాక అన్ని స్ట‌యిల్స్ మార్చేశారు. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. యాక్ష‌న్‌, కామెడీ చేశాను. సెంటిమెంట్ చేయాలంటే గ‌ణేష్‌, ధ‌ర్మ‌చ‌క్రం. కానీ నాకు ఎక్క‌డైనా సీన్‌ లో బ్లాంక్ వ‌స్తే క‌మ‌ల్ హాస‌న్ ఎక్సె్ప్రెష‌న్స్‌ చూసి చేస్తాను. ఈరోజు చాలా ఆనందంగా వుంది. లోకేష్ క‌న‌క‌రాజ్‌ కు థ్యాంక్స్‌. క‌మ‌ల్‌ సార్‌ తో ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయాలని ఉంది. నితిన్‌, సుధాక‌ర్‌రెడ్డిగారు ఈ సినిమాను విడుద‌ల‌చేస్తున్నారు. జూన్ 3న వ‌స్తుంది. అంద‌రూ చూడాలి అన్నారు.