AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: గంజాయికి యువత దూరంగా ఉండాలి.. వెంకీ మామ సలహా ఇదే..

గంజాయి సాగు, రవాణా, వినియోగానికి యువత దూరంగా ఉండాలని అన్నారు హీరో వెంకటేశ్. తన కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం అరకు లోయ వచ్చిన ఆయన పోలీస్ శాఖ రూపొందించిన స్వచ్ఛ సంకల్పం పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని అన్నారు.

Venkatesh: గంజాయికి యువత దూరంగా ఉండాలి.. వెంకీ మామ సలహా ఇదే..
Venkatesh
Maqdood Husain Khaja
| Edited By: Rajitha Chanti|

Updated on: Nov 09, 2024 | 6:04 PM

Share

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నేను సైతం అన్నారు విక్టరీ వెంకటేష్. అల్లూరి జిల్లా అరకులోయ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న ఆయన.. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వచ్ఛ సంకల్పం బ్రోచర్ ను ఆవిష్కరించారు. పోలీసుల స్వచ్ఛ సంకల్పం అవగాహన కార్యక్రమానికి హీరో వెంకటేష్ ప్రశంసించారు. అరకు లోయలో షూటింగ్ కు పాల్గొనేందుకు వచ్చిన వెంకటేష్ ను అల్లూరి జిల్లా పోలీసులు కలిశారు. ఎస్పీ అమిత్ బర్దర్ నేతృత్వంలో చేపడుతున్న యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమాలను వెంకటేష్ కు వివరించారు పోలీసులు. స్వచ్ఛ సంకల్పం బ్రోచర్లను కూడా చూపించారు. దీంతో పోలీసులు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించిన హీరో విక్టరీ వెంకటేష్.. అల్లూరి జిల్లా పోలీసులు మత్తు పదవ తరగతి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.

గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు గిరిజన యువత దూరంగా ఉండాలని హీరో వెంకటేష్ పిలుపునిచ్చారు. గంజాయి జోలికి వెళ్లి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఇటీవల కాలంలో అల్లూరి జిల్లా పోలీసులు గంజాయి ఉక్కు పాదమే మోపుతున్నారు. వేర్వేరు విధాలుగా గంజాయికి దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గతంలో గంజాయి పండించే రైతులకు అధికారుల ద్వారా ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహిస్తున్నారు. గంజాయి స్మగ్లర్లపై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు.. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల పైన నిఘా పెంచి అరెస్టులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గిరిజనులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యవంతం చేస్తున్నారు. ర్యాలీలో ప్రదర్శనలు నిర్వహించి మత్తుకు వ్యతిరేకంగా గిరి యువత ఉండాలని పిలుపునిస్తున్నారు అల్లుడు జిల్లా పోలీసులు.

Venky

Venky

అందులో భాగంగానే సెలబ్రెటీలతో జనాల్లో ఓ చక్కటి మెసేజ్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలతో గంజాయి మత్తుకు వ్యతిరేకంగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన అల్లుడు జిల్లా పోలీసులు.. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో స్వచ్ఛ సంకల్పం బ్రోచర్ను ఆవిష్కరింప చేశారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.