
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్, నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించాడు. అటు కమెడియన్ గా.. ఇటు హీరోగా.. విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించాడు. ఇక ఇప్పుడు తెలుగులోనే కాకుండా అటు మలయాళంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు సునీల్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సహాయ నటుడిగా, లేదా హాస్య నటుడిగా కాదు.. విలన్ పాత్రతో మలయాళీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న టర్బో సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నా. తాజాగా ఈ మూవీ నుంచి సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సునీల్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు.
టర్బో సినిమాలో సునీల్ ఆటో బిల్లా అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో చేసిన అనేక చిత్రాలకు.. పాత్రకు ఈ టర్బో చిత్రంలో సునీల్ పోషించే పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో పవర్ ఫుల్ పాత్రలో సునీల్ కనిపించనున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా హిట్టయితే కేరళ ఇండస్ట్రీలో సునీల్ బిజీ నటుడు కావడం ఖాయమంటున్నారు తెలుగు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని మే23న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. మమ్ముట్టి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో కన్నడ డైరెక్టర్ నటుడు రాజ్ బీ శెట్టి మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు.
కథ విషయానికి వస్తే.. కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన సాధారణ జీమ్ డ్రైవర్.. చెన్నైకి చెందిన షణ్ముఖ సుందరం అనే వ్యాపారవేత్తతో గొడవలు ఎలా మొదలయ్యాయి ? పలుకుబడి, అధికారంలో తనకంటే ఎన్నో రెట్లు బలవంతుడైన షణ్ముఖ సుందరంతో టర్బో జోస్ ఎలా తలపడ్డాడు.. చివరకు వీరిద్దరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Sunil as Auto Billa#Turbo in Cinemas Worldwide on May 23 , 2024 pic.twitter.com/DA4tjNUQbI
— Mammootty (@mammukka) May 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.