Sudheer Babu: పెళ్లి వీడియో షేర్ చేసిన సుధీర్ బాబు.. ఒకప్పటి టాలీవుడ్ తారలు సందడి.. మహేష్ లుక్ వైరల్..

|

Sep 29, 2024 | 10:02 AM

ఈ చిత్రం అటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మా నాన్న సూపర్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా సుధీర్ బాబు తాజాగా

Sudheer Babu: పెళ్లి వీడియో షేర్ చేసిన సుధీర్ బాబు.. ఒకప్పటి టాలీవుడ్ తారలు సందడి.. మహేష్ లుక్ వైరల్..
Sudheer Babu
Follow us on

టాలీవుడ్ హీరో సుధీర్ బాబుకు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరో మహేష్ బాబు బావగా కాకుండా తన సహజ నటనతో సినీరంగంలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవలే హరోం హార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం అటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మా నాన్న సూపర్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా సుధీర్ బాబు తాజాగా తన పెళ్లి వీడియోను చిన్న గ్లింప్స్ గా కట్ చేసి తన ఇన్ స్టాలో షేర్ చేశారు.

హీరో సుధీర్ బాబు దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు.. మహేష్ బాబు చెల్లెలు పద్మ ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం 2006లో వేడుకగా జరిగింది. అప్పట్లో వీరి పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా సుధీర్ బాబు షేర్ చేసిన పెళ్లి వీడియోలో మహేష్ బాబు కొత్త దంపతులను ఆశీర్వదించడం.. కృష్ణ ఫ్యామిలీ అంతా ఉండడంతో ఈ వీడియోను మహేష్ ఫ్యాన్స్ ఎక్కువగా షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇప్పటికే సుధీర్ బాబు నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి వేడుకలో ఉన్నది కాలం వేదిక ఈ కళ్యాణం అనే పెళ్లి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు తన పెళ్లి వీడియోను జత చేసి ఇలా సినిమా ప్రమోషన్లలో భాగంగా షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.