AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roshan: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. వైజయంతి బ్యానర్‏లో శ్రీకాంత్ తనయుడి సినిమా..

roshan , roshan family, roshan new, roshan movie, roshan latest, srikanth, srikanth son

Roshan: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. వైజయంతి బ్యానర్‏లో శ్రీకాంత్ తనయుడి సినిమా..
Roshan
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2022 | 6:31 PM

Share

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) పెళ్లి సందD సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పర్వవేక్షణలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రోషన్‏కు జోడిగా శ్రీలీలా నటించింది. ఈ సినిమా తర్వాత.. రోషన్ తదుపరి చిత్రాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా రోషన్ తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లో యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ తన ప్రొడక్షన్ నెం 9 చిత్రాన్ని ప్రకటించింది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో రోషన్ బ్యాక్ పోజ్‏లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచింది. ప్రదీప్ అద్వైతం విన్నింగ్ స్క్రిప్ట్ను రెడీ చేసాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Also Read: Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..

Poonam Kaur: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్.. మరే హీరోకు ఇలాంటి క్యారెక్టర్ లేదంటూ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ హంగామా షూరు.. ఆకాశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే..

Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. మర్చిపోతే మరింత ఎఫెక్ట్..