తమిళ్ స్టార్ దళపతి విజయ్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రాబోతున్న సినిమా వరిసు. తెలుగులో ఈ సినిమాను వారసుడు టైటిల్ తో తీసుకురాబోతున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్..పివిపి సినిమా బ్యానర్ల పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అంశాలను బయటపెట్టారు.
వారసుడు చిత్రంలో విజయ్ కు సోదరుడిగా కనిపించబోతున్నాడు శ్రీకాంత్. ఆర్సీ 15 సినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పనిచేయడం కొత్తగా ఉందన్నారు. మొదటిసారి శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ సరికొత్త అనుభూతిని ఆయన షూటింగ్లో చూశాను. అక్కడ వర్క్ చేసే విధానం కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో నా రోల్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. మీరు ఎప్పుడూ చూడని ఓ శ్రీకాంత్ ను మీరు చూడబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 పొలిటికల్ నేపథ్యంలో రాబోతుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.