Oke Oka Jeevitham: ఆసక్తికరంగా ఒకే ఒక జీవితం ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ కంటెంట్‏తో శర్వానంద్..

ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీకార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్‏గా ఉంది.

Oke Oka Jeevitham: ఆసక్తికరంగా ఒకే ఒక జీవితం ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ కంటెంట్‏తో శర్వానంద్..
Oke Oka Jeevitham
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2022 | 2:58 PM

వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ..హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలను చేస్తున్నారు. ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీకార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్‏గా ఉంది.

శర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటేషన్‏కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్రైలర్ ప్రారంభమయ్యింది. అంతలోనే రీతూవర్మ కంగ్రాట్స్ ఆది.. ఫస్ట్ రౌండ్‏లో సెలెక్ట్ అయ్యావు అంటూ మాట్లాడం ఆకట్టుకుంది. అలాగే ఇందులో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకపాత్రలలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు నాజర్ శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ ముగ్గురిని నాజర్ బాల్యంలోకి పంపిస్తాడు. అసలు వీళ్ల గతంలో ఏం జరిగింది ?. మళ్లీ ఎందుకు గతంలోకి వెళ్లాలనుకున్నారు ? అనేది ఈ సినిమా స్టోరీ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల నటింటారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?