Sathyaraj: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప కూతురు.. ఏ పార్టీలో చేరారంటే

నటుడు సత్యరాజ్‌ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. ఆయన ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో. కాస్త వయస్సు మళ్లిన తర్వాత బాహుబలి సినిమాలో కట్టప్పగా దేశ్యవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తమిళ నటుడైన అయన ఎన్నో తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి మెప్పించారు.

Sathyaraj: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప కూతురు.. ఏ పార్టీలో చేరారంటే
Satyaraj

Updated on: Jan 20, 2025 | 11:20 AM

నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్య రాజ్. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఆతర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా ఎదిగారు సత్యరాజ్. తమిళ్ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో సినిమాల్లో మెప్పించారు. హీరోగా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకు అందించారు సత్య రాజ్. పగలే వెన్నెల అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టాడు సత్యరాజ్. ఆతర్వాత ఎక్కువగా సినిమాలు చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో సత్య రాజ్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రల్లో సత్య రాజ్ అదరగొడుతున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన శంఖం సినిమాలో నటించి ఆకట్టుకున్నారు సత్యరాజ్.

ఇది కూడా చదవండి :చిట్టి గుమ్మా.. ఇన్నిరోజులు ఏమైపోయావమ్మా..! ప్రేమకథ చిత్రం హీరోయిన్ను చూశారా..!

ఆతర్వాత వరుసగా సినిమాలు చేశారు ఇక బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో సత్య రాజ్ క్రేజ్ పీక్స్ కు చేరింది. కట్టప్పగా అదరగొట్టారు సత్య రాజ్.  బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు ఈ వర్సటైల్ యాక్టర్. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకున్నారు. తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు సత్య రాజ్. కాగా సత్య రాజ్ కొడుకు కూడా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. డోరా, మాయోన్‌ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఎంత కష్టం వచ్చింది భయ్యా..! ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

సత్యరాజ్ కూతురు పేరు దివ్య సత్యరాజ్‌. ఈ చిన్నది సినిమాల్లో నటించలేదు .. కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దివ్య న్యూట్రిషియన్‌గా కెరీర్‌ కొనసాగిస్తుంది. ఆమె సినిమాల పై పెద్దగా ఆసక్తి  చూపడం లేదు. మీడియాలోనూ ఆమె ఎక్కువగా కనిపించదు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తరచూ నెటిజన్లకు హెల్త్, లైఫ్ స్టైల్‌పై సలహాలు, సూచనలు ఇస్తుంది. అయితే ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దివ్య తాజాగా తమిళనాడులో అధికార పార్టీ DMKలో చేరారు. చెన్నైలోని పార్టీ కార్యాలయం అన్నా అరివలయంలో పార్టీలో ఆమె చేరారు. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. నా జీవితంలో ఈ రోజు మరో కొత్త ముఖ్యమైన అధ్యాయం అని ఆమె చెప్పుకొచ్చింది.

Divya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.