
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న యంగ్ హీరోలలో అతడు ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నారు. విభిన్న కాన్సెప్ట్ కంటెంట్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వస్తున్న ఆ హీరో.. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అతడు హీరోగా హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. మనం మాట్లాడుకుంటున్న హీరో మరెవరో కాదు.. సంతోష్ శోభన్.ఈ ప్రేమికుల రోజున కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి. స్కూల్ డేస్ లో తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టారు. అలాగే ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. “కైవల్లి.. తను స్కూల్లో నా గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఆమె ఎక్కడుందో తెలియదు. ఇప్పుడన్నా కనెక్ట్ అయి ఫీల్ అవుతుందేమో. ఆమె నాకు చాలా ఇష్టం కానీ వర్కౌట్ కాలేదు. ఒకే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల ఇంకా దగ్గరయ్యాం. ఇద్దరు స్కూల్ కు ఆటోలో కలిసి వెళ్లి కలిసి వచ్చేవాళ్లం. తనతో చాలా ఎక్కువ టైం గడిపేవాడిని. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు” అని అన్నారు. ప్రస్తుతం సంతోష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
గోల్కొండ హైస్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు సంతోష్ శోభన్. ఆ తర్వాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మినీ కథ వంటి చిత్రాలతో హీరోగా మెప్పించారు. చివరగా 2023లో జోరుగా హుషారుగా షికారు పోదాం అనే సినిమాలో కనిపించారు. గత రెండేళ్లుగా మరో మూవీ చేయలేదు. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యారు.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..