Raviteja: మాస్ ఆడియన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. రీరిలీజ్‏కు సిద్ధమైన రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్..

ఇప్పటివరకు రీరిలీజ్ అయిన చిత్రాలకు సినీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. దీంతో ఇక మాస్ ఆడియన్స్‏కు పండగే..

Raviteja: మాస్ ఆడియన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. రీరిలీజ్‏కు సిద్ధమైన రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్..
Mirapakay

Updated on: Feb 20, 2023 | 8:07 AM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. ముందు స్టార్ హీరోస్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ హిట్ చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఆ తర్వాత ప్రత్యేకమైన రోజులలో.. దర్శక నిర్మాతల బర్త్ డేస్ కానుకగా రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ఖుషి, తొలి ప్రేమ, మహేష్ బాబు పోకిరి, దూకుడు, ఒక్కడు, ప్రభాస్ బిల్లా, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నువ్వే నువ్వే, బాద్ షా వంటి హిట్ చిత్రాలను మళ్లీ 4కె వెర్షన్ తో రీరిలీజ్ చేయగా.. భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. అంతేకాకుండా ఇప్పటివరకు రీరిలీజ్ అయిన చిత్రాలకు సినీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. దీంతో అటు రవితేజ అభిమానులకు ఇక మాస్ ఆడియన్స్‏కు పండగే..

మాస్ మాహారాజా రవితేజ ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవితో కలిసిన నటించిన వాల్తేరు వీరయ్య కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రవితేజ.. ఇప్పుడు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ చిత్రం మిరపకాయ్ రీరిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాను జనవరి 26న రీరిలీజ్ కావాల్సి ఉండగా.. అనుకోకుండా కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో సునీల్, చంద్రమోహన్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు కీలకపాత్రలలో నటించగా.. రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.