Ramarao On Duty: ఫ్యాన్స్‏కు షాకిచ్చిన మాస్ మాహారాజా..రామారావు ఆన్ డ్యూటీ విడుదల వాయిదా..

|

May 26, 2022 | 11:57 AM

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 17న విడుదల చేయనున్నట్లు

Ramarao On Duty: ఫ్యాన్స్‏కు షాకిచ్చిన మాస్ మాహారాజా..రామారావు ఆన్ డ్యూటీ విడుదల వాయిదా..
Ramarao On Duty
Follow us on

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాస్ మాహారాజా అభిమానులకు షాకిచ్చారు మేకర్స్. రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

” రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల వాయిదా పడింది.. బెస్ట్, మాసియెస్ట్ అవుట్ పుట్ సిద్ధం చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఈ సినిమాను జూన్ 17న విడుదల చేయడం.. త్వరలోనే కొత్తి విడుదల తేదీని ప్రకటిస్తాము” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో రవితేజాకు జోడిగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేష్‌, పవిత్రా లోకేష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా’ లిరికల్ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతోపాటు రవితేజ ధమకా సినిమాలోనూ నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..