
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. మొదట్లో సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించారు. ఆ త్రవాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. వయసు పెరుగుతున్నప్పటికీ ఏమాత్రం ఎనర్జీ లెవర్స్ తగ్గకుండా కుర్రహీరోలకు సైతం గట్టిపోటీనిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షుకలను అలరిస్తున్నారు. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం మాస్ మహారాజా తన తర్వాతి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో రవితేజ ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి జపాన్, బ్యాంకాక్ వంటి దేశాలకు వెకేషన్ వెళ్లారు రవితేజ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో రవితేజ భార్య, కొడుకు, కూతురుతోపాటు మరికొందరు బంధువులు కనిపించారు. ఈ ఫోటోలలో రవితేజ కూతురు మోక్షద భూపతి రాజు స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. బయట పెద్దగా కనిపించని మోక్షద ఫోటోస్.. ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోక్షద త్వరలోనే సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ కథానాయికగా కాకుండా నిర్మాతగా సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వనుందట. తండ్రి బ్యానర్ ఆర్ టీ టీమ్ వర్క్స్ కాకుండా కొత్తగా మరో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించాలనుకుంటుందట. ప్రస్తుతం మోక్షద సితార సంస్థలో చేరి ప్రొడక్షన్ మెళకువలు నేర్చుకునే పనిలో ఉందని టాక్. మరోవైపు రవితేజ తనయుడు మహాధన్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :