Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్‌ కేసు.. ఈడీ ముందు నటుడు రవితేజ.. ముగిసిన విచారణ

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. ఈడీ విచారణలో భాగంగా గురువారం..

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్‌ కేసు.. ఈడీ ముందు నటుడు రవితేజ.. ముగిసిన విచారణ

Updated on: Sep 09, 2021 | 4:11 PM

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. ఈడీ విచారణలో భాగంగా గురువారం నటుడు రవితేజ హాజరు అయ్యారు.  ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో భాగంగా సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ శ్రీనివాస్‌, కెల్విన్‌ స్నేహితుడు బీషన్‌ను ఈడీ విచారించింది. బీషన్‌ అలీఖాన్‌తో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు ఈడీ అధికారులు.

మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలన,  అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? తదతర వివరాలపై విచారించారు.

కాగా, ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, నందులను అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ క్లబ్ మేనేజర్‌గా నవదీప్ ఉన్న సమయంలోనే ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే రవితేజపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Childhood Photo: ఈ ఫొటోలో చిన్నారిని గుర్తు పట్టారా.. హిస్టారికల్ మూవీలో మెగా హీరోకి.. జోడీగా నటిస్తున్న ముంబై బ్యూటీ ..

Tollywood: మూడు పదుల వయసులోనూ తరగని అందంతో మత్తెక్కిస్తున్న భామలు..