AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

January Masam Song: ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. కానీ.. 7G బృందావన్ కాలనీ హీరో..

7G బృందావన్ కాలనీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో రవికృష్ణ. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్. రత్నం కుమారుడు ఆయన. తన మొదటి సినిమాతోనే రవికృష్ణ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో అల్లరి చిల్లరిగా తిరిగే ఒక మధ్యతరగతి యువకుడి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో తన నటనకు గానూ ఆయన 'ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సౌత్ డెబ్యూ హీరో' అవార్డును గెలుచుకున్నారు.

January Masam Song: ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. కానీ.. 7G బృందావన్ కాలనీ హీరో..
Ravikrishna
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2026 | 4:41 PM

Share

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రవికృష్ణ. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. రవికృష్ణ కెరీర్ మలుపు తిప్పిన సినిమా 7G బృందావన్ కాలనీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆస్థాయిలో మరో హిట్టు అందుకోలేకపోయారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రవికృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, ఆయన నటించిన 7G బృందావన్ కాలనీమ మూవీలోని ‘జనవరి మాసం’ (January Masam) అనే ప్రత్యేక సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన మరియు సరదా సంఘటనలను ఈ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు .

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఈ పాట చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ఒక కష్టమైన అనుభవాన్ని రవికృష్ణ పంచుకున్నారు. ‘జనవరి మాసం’ సాంగ్ షూట్ చేస్తున్న రోజున తనకు తీవ్రమైన జ్వరం వచ్చిందని ఆయన చెప్పారు. ఒంట్లో అస్సలు ఓపిక లేకపోయినా, షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో అలాగే కష్టపడి డాన్స్ చేశానని వివరించారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు అందించిన మద్దతును ఆయన చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ లేదా ప్రాజెక్ట్ షూటింగ్ విశేషాల గురించి మాట్లాడుతూ, దర్శకుడి రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవని తెలిపారు. సీన్ ఉన్నా లేకపోయినా, ఆర్టిస్టులందరూ ఉదయం 5:30 లేదా 6:00 గంటలకల్లా సెట్స్‌లో ఉండాలని దర్శకుడు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారట. దీనివల్ల నటీనటులందరూ తెల్లవారుజామునే సెట్స్‌కు చేరుకుని, కలిసి సమయం గడిపేవారమని చెప్పారు. ఒకరోజు షూటింగ్ గ్యాప్‌లో బాగా అలసిపోయి, నిద్ర వస్తుంటే కాస్ట్యూమ్ రూమ్‌కి వెళ్లి పడుకున్నానని, మిగిలిన వాళ్లు బయట షూట్ చేస్తున్నారని రవికృష్ణ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

షూటింగ్ సమయంలో నటీనటుల మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. సెట్స్‌లో అందరికంటే ఎక్కువగా ఎవరు తింటారు (ఫుడీ), ఎవరు లేట్‌గా వస్తారు, ఎవరు ఎక్కువగా అడ్జస్ట్ అవుతారు వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు . అందరూ కలిసికట్టుగా వర్క్ చేయడం వల్లే ఈ అవుట్‌పుట్ ఇంత బాగా వచ్చిందని టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

Follow Us