Rakshit Shetty: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై రక్షిత్ శెట్టి ఆసక్తికర కామెంట్స్.. అసలు ఏమన్నారంటే..

మార్ఫింగ్ వీడియో చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. కొన్ని సోషల్ మీడియా వేదికలకు కొత్త నియమ నిబంధనలను పంపింది. ఆ నిబంధనలు అధిగమిస్తే జైలు శిక్షతోపాటు లక్ష రూపాయాల జరిమానా కూడా విధిస్తామని తెలిపింది. ఇక రష్మిక ఫేక్ వీడియోపై కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు రష్మిక ఇష్యూ పై ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Rakshit Shetty: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై రక్షిత్ శెట్టి ఆసక్తికర కామెంట్స్.. అసలు ఏమన్నారంటే..
Rakshi Shetty, Rashmika Man

Updated on: Nov 16, 2023 | 3:58 PM

కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియో చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. కొన్ని సోషల్ మీడియా వేదికలకు కొత్త నియమ నిబంధనలను పంపింది. ఆ నిబంధనలు అధిగమిస్తే జైలు శిక్షతోపాటు లక్ష రూపాయాల జరిమానా కూడా విధిస్తామని తెలిపింది. ఇక రష్మిక ఫేక్ వీడియోపై కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు రష్మిక ఇష్యూ పై ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఇటీవల తెలుగు తెరపై సూపర్ హిట్ అందుకున్న చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ. రక్షిత్ శెట్టి, వసంత్ రుక్మిణి కలిసి నటించిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రాబోతుంది. సప్త సాగారాలు దాటి సైడ్ బీ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు రక్షిత్ శెట్టి. ఇందులో భాగంగానే ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి.. రష్మిక ఫేక్ వీడియోపై స్పందించారు.

ఇవి కూడా చదవండి

“ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కు లైసెన్స్ కచ్చితం అనే రూల్ తీసుకురావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్ వేర్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి” అంటూ చెప్పుకొచ్చారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా పెద్ద కలలు ఉన్న అమ్మాయి అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ వైరలవుతుంది.

రష్మిక.. 2017లో కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. రక్షిత్ హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరికి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2017లోనే నిశ్చితార్థం జరిగింది. కానీ సంవత్సరం తర్వాత 2018లో వీరు తమ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.