Rajendra Prasad: అనుచిత వ్యాఖ్యలపై దుమారం.. నటుడు రాజేంద ప్రసాద్ సంచలన నిర్ణయం.. ఇకపై..

ఈ మధ్యన సినిమాలతో పాటు తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆ మధ్యన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇటీవల కమెడియన్ అలీని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి.

Rajendra Prasad: అనుచిత వ్యాఖ్యలపై దుమారం.. నటుడు రాజేంద ప్రసాద్ సంచలన నిర్ణయం.. ఇకపై..
Rajendra Prasad

Updated on: Jun 05, 2025 | 6:48 AM

ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇదొక్కటే కాదు.. ఈ మధ్యన రాజేంద్ర ప్రసాద్ మాటలు బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి. దీంతో చాలా మంది రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు. ‘అరే.. అవి తిట్లు కాదురా బాబు.. నా ప్రేమ అలాంటిది’ అని మొత్తుకున్నా రాజేంద్రుడిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారీ సీనియర్ నటుడు. ఈ క్షణం నుంచి తన ఆఖరి శ్యాస వరకు ఇకపై ఎవరినీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడనని పేర్కొన్నారు.

‘నేను ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ కూడా వివరణ ఇచ్చుకున్నాడు. హానెస్ట్ గా నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్‌గా ఎలా ఉంటాను? అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఎవరినీ ఏకవచనంతో పిలవను. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే… సీనియర్ ఎన్టీఆర్ నుంచి. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అనే వారు కారు. మీరు అనే వారు. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడూ మాట్లాడను. నేను మాట్లాడిన వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్’.

ఇవి కూడా చదవండి

‘ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే అంటే పర్సనల్‌ ఫంక్షన్‌ అనుకున్నాను. కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే.. వాళ్లందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్‌ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నేనేం మాట్లాడానో. చిన్న చిన్న క్లిప్పింగ్స్‌ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అయినా నేటి సోషల్‌ మీడియా యుగంలో పాత రోజుల్లోలాగా ప్రేమ, ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదు. నా లిమిట్స్‌లో ఉండటం బెటర్‌ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవర్నీ నువ్వు అనను, మీరు అనే అంటాను’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

వీడియో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.