న్యూ ఇయర్ వచ్చేస్తుంది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి మనమంతా స్వాగతం పలకనున్నాము. ఇక బుల్లితెరపై కొత్త ఏడాది కోసం స్పెషల్ షోస్, ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. తాజాగా యాంకర్ సుమ కనకాల అడ్డా దావత్ అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రాం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. ఇప్పుడు యూట్యూబ్ లో తెగ వైరలవుతుంది. ఈ షోలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సమీర్, సుమ, సౌమ్య శారదా, రీతూ చౌదరి, అరియనా గ్లోరీ, హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్ సందడి చేశారు. ఈ షోలో తమ కామెడీ, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అయితే ఈ ప్రోమో చివరలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇందులో రాజీవ్ కనకాలకు తన తల్లిదండ్రులు దేవదాస్ కనకాల, లక్ష్మి కనకాల విగ్రహం గిఫ్ట్ ఇచ్చారు. ఈ విగ్రహం చూడగానే నటుడు బ్రహ్మాజీ తనకు గురువు అని.. మాస్టారు, మేడమ్ అని పిలిచేవాళ్లము.. మేము ఇక్కడ ఉన్నామంటే అందుకు కారణం వాళ్లే అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్క్రీన్ పై వేసిన తన ఫ్యామిలీ ఫోటో చూసి ఒక్కసారిగా ఏడ్చేశాడు రాజీవ్ కనకాల. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం నేను వీళ్ల కడుపున పుట్టడం.. ఇప్పుడు వాళ్లు ముగ్గురు లేరు. నా తోడబుట్టింది, నన్ను కన్నవారు లేరు అంటూ ఏడ్చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఏడ్చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరలవుతుంది.
రాజీవ్ కనకాల తల్లిదండ్రులు దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల నటనలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. సొంతంగా యాక్టింగ్ స్కూల్ స్టార్ట్ చేసి అప్పట్లో ఎంతో మంది సినీరంగంలోకి రావడానికి అండగా నిలిచారు. దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల ఇద్దరూ నటీనటులే.
సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లూరి జిల్లాలో పర్యటించిన ఆయన.. సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానన్నారు. సినిమా షూటింగ్‌లకు అందరూ విదేశాలకు పోతున్నారని.. అలా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్‌లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు పవన్‌కళ్యాణ్..
సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తా: టీడీపీ ఏపీ అధ్యక్షుడు
మరోవైపు.. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్ కూడా ప్రకటించారన్నారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్నారు పల్లా శ్రీనివాస్. సంధ్య థియేటర్ ఘటనపై పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ..”తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందే అంచనా వేయాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. ఫిల్మ్ స్టార్స్ సైతం పరిస్థితిని అంచనా వేయగలగాలి అని సూచిస్తున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదని అన్నారు. ప్రజల ప్రాణాలకు హానీ కల్గకుండా చూడాలి. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలి” అని అన్నారు.
సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రామకృష్ణ.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.