ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు రఘుబాబు. ప్రముఖ నటుడు గిరిబాబు కొడుకు రఘుబాబు. తండ్రి కొడుకులు ఇద్దరూ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు రఘుబాబు. చాలా సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు. అలాగే రఘుబాబు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈయన పంచ్ లకు థియేటర్స్ లో పడీపడీ నవ్వాల్సిందే.. దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ రఘుబాబు నటించారు. నటన మాత్రమే కాదు రఘుబాబులో మరో టాలెంట్ ఉంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రఘుబాబు ఓ పాటను ఆలపించారు. శ్రీదేవి , కమల్ హాసన్ నటించిన వసంత కోకిల సినిమాలోని కథగా కల్పనగా అనే సాంగ్ ను తమిళ్ వర్షన్ లో పాడారు రఘుబాబు. ఎంతో అద్భుతంగా ప్రొఫిషనల్ సింగర్ లా ఆ పాటను ఆలపించారు రఘుబాబు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. రఘుబాబు తమిళ్ లో పాట పాడటంతో దేశముదురు సినిమాలో తమిళ్ నేర్చుకొని ఇప్పుడు పాట పడుతున్నారు అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అద్భుతంగా పాడారు అని కొనియాడుతున్నారు. మరికొంతమంది నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో రఘుబాబు పాడిన లంగావోణీ సాంగ్ సీన్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా నిజంగా రఘుబాబు అద్భుతంగా పాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.