Raghava Lawrence: కూతురి కోసం దాచి పెట్టిన డబ్బుకు చెదలు.. గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. డాన్స్ మాస్టర్ గా, స్టార్ హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు లారెన్స్. అంతకు మంచి తన సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Raghava Lawrence: కూతురి కోసం దాచి పెట్టిన డబ్బుకు చెదలు.. గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్
Actor Raghava Lawrence

Updated on: May 08, 2025 | 10:21 AM

సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన వారిలో రాఘవ లారెన్స్ ఒకడు. ఒకప్పుడు సైడ్ డ్యాన్సర్ గా పని చేసిన అతను ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. అంతేకాదు హీరోగా, డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. ప్రస్తుతం ఎక్కువగా హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే.. రాఘవ లారెన్స్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అనాథ పిల్లలకు చదువు చెప్పియడం దగ్గర్నుంచి రైతులకు ట్రాక్టర్లు, మహిళలకు కుట్టు మిషన్లు.. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. సాయం కోసం ఎవరైనా చేయి చాచితే.. నేనున్నానంటూ ముందుకొస్తాడీ రియల్ హీరో. తన ఛారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యలో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించిన లారెన్స్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆపదలో ఉన్న ఒకరికి తన వంతు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.

అసలు ఏం జరిగిందంటే?

ఇవి కూడా చదవండి

తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని క్లాధారి గ్రామానికి చెందిన ముత్తు కరుప్పు (30) ఒక సాధారణ కూలి. రోజు కూలీ పనుల కెళ్లి వచ్చిన డబ్బులను టిన్ కాయిన్‌లో ఉంచి ఇంటిలోని మట్టిలో పాతిపెట్టాడు. సుమారు లక్ష రూపాయల వరకు అందులో పోగు చేశాడు. అయితే ఇటీవల తన కూతురి చెవి పోగు వేడుక కోసం దాచిన డబ్బును తీశాడు. తీరా చూస్తే.. చెద పురుగులు డబ్బును మొత్తం మాయం చేశాయి’ ఈ విషయాన్ని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చెదలు పట్టిన డబ్బులతో కుటుంబం బాధపడుతోన్న ఫొటోను షేర్ చేసి ‘ ఈ ఫ్యామిలీకి సహాయం చేయండి’ అంటూ రాఘవ లారెన్స్‌ను ట్యాగ్ చేశాడు.

లారెన్స్ ట్వీట్..

ఇది చూసిన లారెన్స్ వెంటనే స్పందించాడు.. ‘హాయ్ బ్రదర్, నేను ఇప్పుడే ఈ పోస్ట్ చూశాను. చదివినప్పుడు నా గుండె తరుక్కుపోయింది. నేను వారి కోసం లక్ష రూపాయలు విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ సమాచారాన్ని వారికి చేరవేయండి. నన్ను ట్యాగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం లారెన్స్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు , నెటిజన్లు లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చెదలు పట్టిన డబ్బులతో …

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.