Raghava Lawrence: ‘నువ్వు దేవుడివి సామీ’.. పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన లారెన్స్.. వీడియో

రాఘవ లారెన్స్.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఈ మధ్యన ఆయన సినిమాల కంటే రియల్ హీరోగా తను చేసిన సేవా కార్యక్రమాలే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. తన సేవా ట్రస్ట్ పేరుతో ఇప్పటికే ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు రాఘవ లారెన్స్

Raghava Lawrence: నువ్వు దేవుడివి సామీ.. పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన లారెన్స్.. వీడియో
Actor Raghava Lawrence

Updated on: May 02, 2024 | 4:31 PM

రాఘవ లారెన్స్.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఈ మధ్యన ఆయన సినిమాల కంటే రియల్ హీరోగా తను చేసిన సేవా కార్యక్రమాలే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. తన సేవా ట్రస్ట్ పేరుతో ఇప్పటికే ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు రాఘవ లారెన్స్. ఆనాథ పిల్లలు, దివ్యాంగుల కోసం ఇటీవలే ద్విచక్ర వాహనాలు కూడా పంపిణీ చేసి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపారు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈసారి పేద రైతుల కళ్లల్లో వెలుగులు నింపాడు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం పది మంది పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు రాఘవ. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. మాత్రమ్ సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంతకు ముందు ప్రెస్ మీట్‌లో నేను చెప్పినట్లుగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామని చెప్పాం. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందిస్తున్నాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ రోజు అతను కొత్త ట్రాక్టర్‌ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే రాజన్నన్ ని పిలిపించి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం’ అని తన వీడియోలో రాసుకొచ్చారు రాఘవ లారెన్స్.

ఈ సందర్భంగా తమ కోసం లారెన్స్ మాస్టర్ తీసుకొచ్చిన ట్రాక్టర్ ను చూసి రాజన్నన్ కుటుంబీకులు సంతోషంతో మురిసిపోయారు. ప్రస్తుతం ఈ రియల్ హీరో షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది . అభిమానులు, నెటిజన్లు లారెన్స్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నువ్వు దేవుడివి సామీ’, ‘మీరు గ్రేట్ సార్’, ‘ మీ మంచి పనులు ఇలాగే కొనసాగాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది, జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాఘవ లారెన్స్. ప్రస్తుతం తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడీ రియల్ హీరో.

ఇవి కూడా చదవండి

 

రైతుకు ట్రాక్టర్ అంజేస్తున్న రాఘవ లారెన్స్.. వీడియో ఇదిగో..

దివ్యాంగులకు త్రీ వీలర్ బైక్స్ పంపిణీ.. వీడియో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.