Salaar 2 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..

'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' డిసెంబర్ 22, 2023న విడుదలైంది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో విజయం సొంతం చేసుకుంది. అలాగే దాదాపు 700కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా 2వ భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సలార్ 2' షూటింగ్ ఎప్పుడెప్పుడా అని సోషల్ మీడియాలో అభిమానులు మేకర్స్ ను అడుగుతున్నారు.

Salaar 2 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..
Salaar 2
Follow us

|

Updated on: May 02, 2024 | 4:16 PM

దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ కు సలార్ సినిమా రూపంలో హిట్ అందింది. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాను రెండు భాగాలుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ డిసెంబర్ 22, 2023న విడుదలైంది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో విజయం సొంతం చేసుకుంది. అలాగే దాదాపు 700కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా 2వ భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సలార్ 2’ షూటింగ్ ఎప్పుడెప్పుడా అని సోషల్ మీడియాలో అభిమానులు మేకర్స్ ను అడుగుతున్నారు. తాజాగా ఈ దీని పై క్రేజీ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

మే నెలాఖరులో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ‘సలార్’ సినిమాను మించి ఉండేలా..‘సలార్ 2’ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసేందుకు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ కొంత సమయం తీసుకున్నారని టాక్. ఇప్పుడు షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మే చివరి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 10 రోజుల పాటు ‘సలార్ 2’ సినిమా తొలి షడ్యూల్ షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. షూటింగ్‌లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని. ‘సలార్ 2’లోని చాలా సన్నివేశాల షూటింగ్ ఈ ఏడాదిలోనే పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు శివార్లలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘సలార్ 2’కి ‘హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా డిసెంబర్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. సెకండ్ పార్ట్‌లో చాలా మంది నటీనటులు కనిపించనున్నారట. ఆర్టిస్టులను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట. ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.  ‘సలార్ 2’, ‘కల్కి 2898 AD’, ‘ది రాజా సాబ్’ స్పిరిట్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలన్నింటిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో