AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! సోషల్ మీడియాలో పోస్టుతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..

తమిళనాడు సీఎం విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేసినప్పుడు సినీ నటులెవరూ పెద్దగా స్పందించలేదు. అయితే కాలక్రమేణా ఆ పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఏకంగా తమిళనాడులో అధికారం కూడా చేపట్టింది. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో టీవీకే పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నాడు.

CM Vijay: టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! సోషల్ మీడియాలో పోస్టుతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
CM Vijay
Basha Shek
|

Updated on: Jun 07, 2026 | 12:51 PM

Share

తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్ తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మరీ సంచలన నిర్ణయాలు తీసుకోకపోయినా సామాన్య ప్రజలకు, రైతులకు, సినిమా ఇండస్ట్రీకి మేలు చేసేలా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ప్రైవేటు స్కూల్స్ ఫీజుల విషయంలోనూ విజయ్ వ్యవహరించిన తీరు అందరి మన్ననలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే సీఎం విజయ్ టీవీకే పార్టీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్ రాబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. అంతేకాదు విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని రూమర్లు వస్తున్నాయి. ఇప్పుడీ రూమర్లకు ఎండ్ కార్డ్ వేస్తూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు రాఘవ లారెన్స్. కాగా కొన్ని రోజుల క్రితం జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్.. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రెండు చోట్టా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే రాజ్యంగం ప్రకారం ఒక చోట రాజీనామా చేయాలి. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ సీటుకు రాజీనామా చేశారు.

అయితే ఈ స్థానంలో హీరోయిన్ త్రిషని నిలబెడతారని గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడీ తిరుచ్చి ఈస్ట్ స్థానంలోనే లారెన్స్.. టీవీకే తరఫున బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. తన తల్లితో కలిసున్న ఒక ఫొటోను షేర్ చేస్తూ..’ అందరికి నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల్లో నేను పోటీ చేస్తానని పలు మీడియా ఫ్లాట్‌ఫామ్స్ లో వార్తలొస్తున్నాయి. తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. రూమర్లు ఎక్కువవుతుండటం వల్ల నేను ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఈ నోట్ షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీకి షెడ్యూల్ పూర్తవుతుంది. 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీర్వాదంతో నా జీవితానికి సంబంధించి ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను’ అని రాసుకొచ్చాడు. అంటే ఇన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే.. తిరుచ్చి ఉపఎన్నికల్లో టీవీకే తరఫున లారెన్స్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపు నిజమేనన్న అభిప్రాయం కలుగుతోంది.

ఇవి కూడా చదవండి

సినిమాఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన వారిలో రాఘవ లారెన్స్ ఒకడు. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన అతను తన ట్యాలెంట్ తో స్టార్ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు. అంతేకాదు హీరోగానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. కేవలం సినిమాల పరంగానే కాదు తన సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లారెన్స్. ఇక విజయ్ తోనూ అతనికి మంచి అనుబంధం ఉంది. ఇక విజయ్ గతంలో చేసిన సినిమాలోని పలు పాటలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశాడు. బహుశా ఆ బాండింగ్ వల్లే విజయ్, తను ఖాళీ చేసిన స్థానంలో లారెన్స్‌కి అవకాశం ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

రాఘవ లారెన్స్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండొద్దా?
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
స్కర్ట్, హైహీల్స్‌లో ఇంజనీర్.. కోట్లాది మందిని ఆకట్టుకున్న స్టైల్
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా..
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..