సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఒక సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుంటారు లారెన్స్. అందుకే తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తద్వారా సమాజం నుంచి సంపాదించిన దాన్ని తిరిగి సమాజానికి అందిస్తున్నాడీ రియల్ హీరో. ఏళ్ల తరబడి సామాజిక సేవలో నిమగ్నమై ఉన్న రాఘవ్ లారెన్స్ తాజాగా తమిళనాడులో కొందరు మహిళా ఆటో డ్రైవర్ల అప్పులు తీర్చి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. రాఘవ్ లారెన్స్ కొద్ది రోజుల క్రితం పేద రైతులకు పది ట్రాక్టర్లను బహుమతిగా ఇచ్చారు. లారెన్స్ చేసిన ఈ గొప్ప పనికి పలువురి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు రాఘవ్ లారెన్స్ కొందరు మహిళా ఆటో డ్రైవర్ల రుణాలను తిరిగి చెల్లించి ప్రశంసలు అందుకున్నారు. రాఘవ్ లారెన్స్, ప్రముఖ యూట్యూబర్ బాలా కలిసి ఈ మంచి పనిని పూర్తి చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ మహిళకు కొత్త ఆటోను బహుమతిగా ఇచ్చాడు రాఘవ లారెన్స్. అయితే అదే రోజు చాలమంది మహిళా ఆటో డ్రైవర్లు లారెన్స్ ను కలిశారు. తమ బాధలను నటుడి ముందు వెళ్లగక్కారు. ఆటో కొనుగోళ్లకు తీసుకున్న అప్పు చెల్లించడానికే తమ కూలి డబ్బులు సరిపోతున్నాయని మహిళలు వాపోయారు. దీంతో చలించిపోయిన లారెన్స్ వారి బ్యాంకు రుణాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు.తద్వారా మహిళలు సంపాదించిన సొమ్మును వారి వద్దే ఉండేలా చేశారు. ఈ సందర్భంగా రాఘవ్ లారెన్స్, బాలా పది మంది మహిళలకు వారి రుణాలు క్లియర్ చేసిన రికార్డులను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా లారెన్స్ చేసిన సహాయానికి మహిళా ఆటో డ్రైవర్లు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు లారెన్స్ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నువ్వు దేవుడివి సామీ’, ‘మీరు గ్రేట్ సార్’, ‘ మీ మంచి పనులు ఇలాగే కొనసాగాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Hi friends and fans! I am excited to announce that Maatram’s service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024
Hi friends and fans! I am proud to introduce my special boys, who have undergone physical challenges, to you all. This tradition is called Mallakhamba and they are incredibly talented. I humbly request you all to consider booking them for your events, shows, and functions using… pic.twitter.com/AUu0EzfUQ3
— Raghava Lawrence (@offl_Lawrence) April 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.