ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వరుస సినిమాలను లైన్లో పెట్టి అభిమానులకు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఖుషి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపొందితుంది. అటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. వీటితోపాటే.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ బడ్జేట్ మూవీ ఇటీవలే స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్షం సినిమా ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ప్రభాస్ అందానికి, కటౌట్ కు ఫిదా అమ్మాయి ఉండదనడంలో అతి శయోక్తి లేదు. తాజాగా మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021గా అగ్రస్థానంలో నిలిచాడు డార్లింగ్.
అందగాడంటే ఎలా ఉండాలి.. మంచి ఒడ్డూపొడవుతో.. ఉండాలి. మాట్లాడుతుంటే..ఆ బేస్ వాయిస్ మన గుండెల్ని తాకాలి. నవ్వుతున్న ఆ మోము చూస్తూ.. మన మది ఫిదా కావాలి. అలా నడుచుకుంటూ పోతుంటే చూడ్డానికి నాలుగు కళ్లు సరిపోవన్నట్టుగా ఉండాలి.. సింపుల్ గా సింగిల్ లైన్లో చెప్పాలంటే… మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లా ఉండాలి..! ఆఆ.. ఇది అందరికి తెలిసిన విషయమేగా.. మరోసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముందని అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరీ చూడండి…!
పాన్ ఇండియా సినిమాలతో ప్రజెంట్ బిజీగా ఉన్న స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడో రికార్డును క్రియేట్ చేశారు. బాహుబలి సినిమాతో ఇప్పటికే ప్రపంచానికి పరిచయమైన మన ప్రభాస్… ఇప్పుడు వరల్డ్ వైడ్ అమ్మాయిలందిరికీ డార్లింగ్ అయిపోయారు. ఏసియాస్ మోస్ట్ హ్యాండ్‌సమ్ మ్యాన్‌గా రికార్డులకెక్కారు. అవును ప్రభాస్ అభిమానులు పండుగచేసుకునేలా… తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలా.. ఓ ఇంటర్నేషనల్ లిస్ట్లో స్థానం సంపాదించారు ప్రభాస్. ఫ్యాన్సీ ఆడ్స్ వారు ప్రతీ సంవత్సరం నిర్వహించే ఏసియాస్ టాప్ 10 మోస్ట్ హ్యాండ్‌సమ్ మెన్ లో.. ఈ సంవత్సరం అంటే 2021 లో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్‌సమ్ మ్యాన్‌గా స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ సంవత్సరం సౌత్ ఇండియా నుంచి మన డార్లింగ్ ఒక్కడే ఈ లిస్ట్లో స్థానం సంపాదించడం… మనం కాలర్ ఎగిరేసి మరీ చెప్పుకోవల్సిన విషయం. ఏమంటారు అంతేగా…!