మెగాస్టార్ చిరంజీవి.. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ అశేష అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్‌లతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. ఆపత్కాలంలో ఉన్నవారికి కాదనకుండా ఆపన్న హస్తం అందించడం ఆయన నైజం. అందుకే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిని అందరివాడుగా భావిస్తారు. అయితే ఎన్ని మంచి పనులు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోరు చిరంజీవి. కుడి చేత్తో చేసిన దానం.. ఎడమ చేతికి కూడా తెలియకూడదన్న సామెతను బాగా నమ్ముతారాయన. కానీ ఆయన సాయం పొందినవారు మాత్రం అప్పుడప్పుడూ మెగాస్టార్ మంచి తనం గురించి మాట్లాడుతుంటారు. తాజాగా ప్రముఖ నటుడు, ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించిన పొన్నంబలం చిరంజీవి చేసిన సాయం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.గతంలో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి రూ.40 లక్షల ఆర్థిక సాయం చేసి తన పాలిట దేవుడయ్యారని ఎమోషనల్ అయ్యారీ స్టార్ విలన్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు పొన్నంబలం. కాగా తమిళ, తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో స్టార్ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పొన్నంబలం. తెలుగులో కూడా టాప్ హీరోలందరి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. అయితే ఎందుకో కానీ సినిమాల నుంచి హఠాత్తుగా మాయయ్యాడు. ఆ తర్వాత ఏకంగా ఆస్పత్రి బెడ్‌పై కనిపించారు.
‘రెండేళ్ల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఎవరైనా సాయం చేస్తారా? అని వేచి చూస్తున్నాను. అప్పుడే నాకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు వచ్చారు. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని ‘నాకు ఆరోగ్యం బాలేదు. ఏమైనా సాయం చేయండి’ అని అన్నయ్యకు మెసేజ్ పెట్టాను. అలా మెసేజ్ చేసిన 10 నిమిషాల తర్వాత నాకు అన్నయ్య నుంచి కాల్ వచ్చింది. హాయ్ పొన్నంబలం.. నీకు నేనున్నాను. అసలు భయపడకు. వెంటనే హైదరాబాద్‌కు వచ్చెయ్ అన్నారు. రాలేను అన్న అంటే.. సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు. మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లాను. అక్కడ ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు వైద్యం చేశారు. నా వైద్యానికి రూ. 40 లక్షలు ఖర్చు అయ్యింది. ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారు. అడగ్గానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా. కానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు’ అని ఎమోషనల్ అయ్యారు పొన్నంబలం. చిరంజీవి గురించి స్టార్ విలన్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరలవుతున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు ‘అన్నయ్యా.. నువ్వు గ్రేట్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే – నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు – అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు
మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు? pic.twitter.com/HHdBcSiwPm
— ???????? ???? ??????? (@Gowtham__JSP) March 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..