Actor Nikhil: షూటింగ్ సెట్‏లో ప్రమాదం.. స్పందించిన హీరో నిఖిల్.. ఏమన్నారంటే..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ది ఇండియా హౌస్. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ లో నిన్న పెను ప్రమాదం జరిగింది. తాజాగా ఈ ఘటనపై హీరో నిఖిల్ స్పందించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు నిఖిల్.

Actor Nikhil: షూటింగ్ సెట్‏లో ప్రమాదం.. స్పందించిన హీరో నిఖిల్.. ఏమన్నారంటే..
Nikhil

Updated on: Jun 12, 2025 | 12:14 PM

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ది ఇండియా హౌస్. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే బుధవారం ఈ మూవీ షూటింగ్ సెట్ లో పెను ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదం పై స్పందించారు నిఖిల్. తామంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారుర.

“ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు కొన్నిసార్లు రిస్క్ చేయడం తప్పదు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. కానీ మా సిబ్బంది తీసుకున్న జాగ్రత్తల కారణంగా మేమంతా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు” అంటూ చెప్పుకొచ్చారు. నిఖిల్ నటిస్తున్న ఈ సినిమా కోసం శంషాబాద్ సమీపంలో వేసిన సెట్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా సెట్ లోకి నీళ్లు ముంచెత్తాయి. దీంతో పలువురి సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అలాగే షూటింగ్ సామాగ్రి మొత్తం నీటిలో తడిచిపోయింది. ఈ చిత్రాన్ని 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో తెరకెక్కిస్తున్నారు.

నిఖిల్ ట్వీట్.. 

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..