ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లలో నవదీప్ ఒకరు. జై సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నవదీప్. హీరోగానే కాకుండా.. స్నేహితుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్ పాత్రలలో నటించారు. ఇటు వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు నవదీప్. ప్రస్తుతం నవదీప్.. సన్నీలియోని టైటిల్ పాత్రలో నటిస్తోన్న వీరమాదేవి చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటు సినిమాలతో ఎంత బిజీగా మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు నవదీప్. అయితే 30 ఏళ్ల వయసు వచ్చినా.. నవదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నా.. పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇంకేముంది నెటిజన్స్ ఉరుకుంటారా ?.. నవదీప్‌ను పెళ్లి విషయంలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. గడ్డం తెల్లబడుతుందన్నా… పెళ్లి చేసుకో అంటూ నెట్టింట్లో సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ చూసిన నవదీప్.. తన పెళ్లి గురించి కామెంట్స్ చేసిన నెటిజన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తన ట్విట్టర్ ఖాతాలో వద్దుల సోదరా అంటూ హెడ్డింగ్ పెట్టి ఓ వీడియో విడుదల చేశారు. అన్నా గడ్డం తెల్లబడుతోంది.. త్వరగా పెళ్లి చేసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు కొందరు. గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్ కానీ.. పెళ్లి కాదు.. దురద పెడితే గోక్కుంటాం.. కానీ తోలు పీక్కోం కాదా అలాగే అంటూ తన పెళ్లి పై తనే సెటైర్స్ వేసుకున్నారు నవదీప్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022
Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆసక్తికరంగా భామా కలాపం టీజర్..
Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..
Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..
Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..