MAA Elections 2021: మా ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా నటుడు నరేష్ మీడియాతో మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ.. మాలో పదవి వ్యామోహాలు లేవు.. ఉండకూడదు కూడా అన్నారు. మాలో చిన్నచిన్న విషయాలు జరిగాయి.. గతంలో భారీ మెజారిటీతో నేను గెలిచాను.. గడిచిన రెండు సంవత్సరాల్లో ఒక ఏడాది కరోనా కారణంగా అయిపోయింది… మిగిలిన ఒక ఏడాదిలో ఒక గ్రూప్‌గా ఏర్పడి.. 11మందిని గ్రూప్‌గా చేసుకొని మినీ టెర్రరిజం చేశారని ఆరోపించారు నరేష్. జరిగినవి జరగలేదని.. జరగనివి జరిగాయని మీడియా ముందుకు వెళ్లి కావాలనే అబద్దపు ప్రచారం చేశారు… ఎందుకు ..? అని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రాణాలకు ప్రాముఖ్యత ఇచ్చాము.. 900 వందల మంది ప్రాణాలకు రక్షణ కల్పించాం అన్నారు.. మెంబర్‌షిప్‌లు యువతకు అందించాలని పదివేలు తగ్గించాం..అన్నారు. మమల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారు.. అయినా ఎదుర్కొన్నాం.. ఈ ముడేళ్ళల్లో మా మసకబారలేదు.. అన్ని పనులు జరిగాయి ఇంకొన్ని మిగిలున్నాయని నరేష్ స్పష్టం చేశారు. నా టర్మ్‌లో మా సేవలకు మురళి మోహన్ చిరంజీవి గారు మెచ్చు కున్నారన్నారు. అలాగే.. మాను ఒక మంచి వారసుడిని ఇచ్చి పోవటం నా బాధ్యత.. ఒక మిక్సి కొనేటప్పుడు అన్ని చూసుకొని కొంటాము..మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తాము అంటే ఎలా..?అని ప్రశ్నించారు. మా కుటుంబానికి విష్ణులాంటి ఒక మంచి మనిషి వుండాలి.. ఎన్నో ఆలోచించిన తరువాత విష్ణు పర్ఫెక్ట్ వ్యక్తి.. నా పూర్తి మద్దతు విష్ణు కి తెలుపుతున్నాను అన్నారు.
లైవ్ వీడియో ఇక్కడ చూడండి..