Golf Edge Residence: నానక్‌రామ్ గూడలో గోల్ఫ్ హెడ్జ్ అసోసియేషన్ వివాదం ముదురుతోంది. గోల్ఫ్ హెడ్జ్ రెసిడెన్సీలో జరుగుతున్న అక్రమాలపై సినీ నటుడు, మాజీ మా అధ్యక్షుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్ఫ్ హెడ్జ్ లో 487 ప్లాట్స్ ఉన్నాయి.. 1500 మంది నివసిస్తున్నారని అన్నారు. ప్రీతి శుక్లా, మాధవ్ కోనేరులు అసోసియేషన్‌ను కబ్జా చేశారని, కరోనా మహమ్మారి కాలంలో లాక్‌డౌన్ సమయంలో ఇది జరిగిందన్నారు. కమిటీ బాధ తట్టులోలేక మూడు కుటుంబాలు వేరే చోటుకు పారిపోయాయని, ప్రాజెక్టులో ఇప్పుడు మార్పులు చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమంగా ఏర్పాటైన కమిటీతో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నరేష్ మండిపడ్డారు. కామన్ స్పేస్ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ ఉల్లంఘనల కారణంగా గోల్ఫ్ హెడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అక్రమాలకు అడ్డుకునే ప్రయత్నం చేసే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని, జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇచ్చినా లెక్క చేయకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్వహణ నిధులు దుబారా చేస్తున్నారని, సెలబ్రిటీ అయిన నన్ను కూడా బెదిరిస్తూ హేళనగా మెయిల్స్ పెడుతున్నారని వాపోయారు.
ఇందులో హీరో సుదీప్ కూడా బాధితుడు అని.. ఎవరయినా అడ్డుకోవడానికి వస్తే, అందరి ప్రాణాలకు హాని కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీని సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డబ్బుల కోసం మాఫియా నడుపుతున్నారని, ఫైర్ స్పేస్ లేకుండా బాల్కానిలు కూడా మూసేస్తున్నారన్నారు అన్నారు. B2714 లో కన్నడ హీరో సుదీప్ ఉంటారు, ఆ ఫ్లాట్‌ణు కూడా ప్లాన్‌కు విరుద్ధంగా కడుతున్నారని ఆరోపించారు. ఇందులో సుదీప్‌కు రెండు ఫ్లాట్స్ ఉన్నాయని, ప్లాట్‌లో జరుగుతున్న అక్రమ కట్టడాలు వెంటనే ఆపేయాలని నరేష్ డిమాండ్ చేశారు.