మహా కుంభమేళాలో తళుక్కుమన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? త్వరలో ఆ క్రేజీ హీరోకు భార్య కానుంది

|

Feb 14, 2025 | 5:01 PM

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మహా కుంభమేళాలో తళుక్కుమంది.

మహా కుంభమేళాలో తళుక్కుమన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? త్వరలో ఆ క్రేజీ హీరోకు భార్య కానుంది
Tollywood Actress
Follow us on

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అప్రతిహతంగా కొనసాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక ఈ నెల 26 వరకు జరగనుంది. 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాలో భాగమవుతున్నారు. ఇక సినీ పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ, హేమ మాలినీ, సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు, సోనాల్ చౌహాన్ తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో హీరోయిన్ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో తళుక్కుమంది. సంప్రదాయ దుస్తులు ధరించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పై ఫొటోలు అవే.. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించిన ఆమె త్వరలో ఒక తెలుగు హీరోకు భార్య కానుంది. ఇప్పటికే ఇద్దరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.

మహా కుంభమేళాలో తళుక్కుమన్న ఈ అందాల తార మరెవరో కాదు సిరి లేళ్ల. అదే నండి.. ప్రతినిధి 2 హీరోయిన్. అలాగే హీరో నారా రోహిత్ కు కాబోయే భార్య కూడా. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు బయటు దేరిందీ అందాల తార. మహా కుంభమేళాతో పాటు కాశీ, వారణిసి వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకుంది. అలాగే తన యాత్రా విశేషాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో సిరి లేళ్ల..

నారా రోహిత్- సిరి లేళ్ల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్ 14న గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది.

నారా రోహిత్ తో ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..