Actor Nani: గజరాజు నడిస్తే.. గజ్జి కుక్కలు అరుస్తాయి.. అలాంటి జోకర్లందరూ మెల్కోండి అంటూ నాని టీం పోస్ట్..

న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని సాధారణ అబ్బాయి.. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు.

Actor Nani: గజరాజు నడిస్తే.. గజ్జి కుక్కలు అరుస్తాయి.. అలాంటి జోకర్లందరూ మెల్కోండి అంటూ నాని టీం పోస్ట్..

Updated on: Apr 03, 2025 | 10:13 AM

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈమూవీతోపాటు మరోవైపు ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. దసరా సినిమాతో నాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో నాని ఊహించని లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఓటీటీలో ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. అలాగే గ్లింప్స్ తోనే సంచనలం సృష్టించిన ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని.. మార్పులు చేశారని.. దీంతో బడ్జెట్ మరింత పెరిగిపోయిందని.. దీంతో సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ గట్టిగానే రియాక్ట్ అయ్యింది. తాజాగా ది ప్యారడైజ్ సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.

‘ది ప్యారడైజ్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అనుమానాలు వద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దానిని మీరుందరూ కూడా త్వరలోనే చూస్తారు. సమయం వచ్చే వరకు కొందరు రూమర్స్ తో బతికేయవచ్చు. గజరాజు నడుస్తూ గర్జిస్తుంటే నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి. ది ప్యారడైజ్ సినిమపా అభిమానులు చూపించే ప్రేమను మేము చూస్తునే ఉన్నాం’ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..