AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song : ఇదెక్కడి క్రేజ్ రా మావ.. యూట్యూబ్‏ను ఊపేస్తోన్న మాస్ సాంగ్.. ఏకంగా 150 మిలియన్ వ్యూస్..

ప్రస్తుతం యూట్యూబ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఓ సినిమా పాట నెట్టింట దూసుకుపోతుంది. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. కేవలం 3 నెలల్లోనే 150 మిలియన్ వ్యూస్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట పేరే వినిపిస్తుంది.

Trending Song : ఇదెక్కడి క్రేజ్ రా మావ.. యూట్యూబ్‏ను ఊపేస్తోన్న మాస్ సాంగ్.. ఏకంగా 150 మిలియన్ వ్యూస్..
Nani The Aaya Sher Song
Rajitha Chanti
|

Updated on: May 27, 2026 | 4:29 PM

Share

యూట్యూబ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఒక్క నెలలో నాలుగైదు పల్లె పాటలు విడుదలై సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే కోట్ల వ్యూస్ అందుకుంటూ సత్తా చాటుతున్నాయి. అయితే ఇప్పుడు పల్లె పాటలు కాకుండా మరో సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అదే యూట్యూబ్‏లో “ఆయా షేర్ సాంగ్”. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ది ప్యారడైజ్ సినిమాలోనిది ఈ పాట. విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అయిన సంగతి తెలిసిందే. యూట్యూబ్, ఇన్ స్టాలో ఈ పాట సెన్సేషన్ అయ్యింది. ఇందులో నాని ఎనర్జిటిక్ స్టెప్పులు, మాస్ లుక్, మ్యూజిక్ బీట్స్ హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా అనిరుధ రవిచందర్ అందించిన పక్కా మాస్ పవర్ ఫుల్ బీట్ ఈ పాటకు ప్రధాన బంలగా మారాయి. దీంతో ఈ పాటకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.

దాదాపు 3 నెలల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటివరకు 150 మిలియన్ వ్యూస్ కు.. 1.6 మిలియన్ లైక్స్ అందుకుని యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. నాని కెరీర్ లోనే ది ఫాస్టెస్ట్ గ్రోత్ అందుకున్న పాటగా ఆయా షేర్ సాంగ్ నిలిచిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్, ఇన్ స్టాలో సత్తా చాటుతుంది. ఇక ఇందులో నాని చేసిన హుక్ స్టెప్ గురించి చెప్పక్కర్లేదు. విడుదలైన మొదటి రోజే ఈ పాటలోని నాని హుక్ స్టెప్ ను ఇన్ స్టా రీల్స్ లో చిన్నా పెద్ద అందరూ ట్రై చేయడంతో ఎక్కువగా రీచ్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Vantalakka: నా భర్త నాతో కలిసి ఉండడు.. కారణం అదే.. కార్తీక దీపం వంటలక్క కామెంట్స్..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ది ప్యారడైజ్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాని పక్కా ఊర మాస్ లుక్కులో కనిపించనున్నారు. అలాగే కయాదు లోహర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. దసరా తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాను తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

ఆయా షేర్ వీడియో సాంగ్.. 

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

Follow Us