Nani: మరో ప్రయోగం చేయబోతున్న హీరో నాని.. సింగరేణి బొగ్గు గని కార్మికుడి జీవిత కథలో న్యాచురల్ స్టార్..

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్‏తో వెల్‏కమ్ చెప్పారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో

Nani: మరో ప్రయోగం చేయబోతున్న హీరో నాని.. సింగరేణి బొగ్గు గని కార్మికుడి జీవిత కథలో న్యాచురల్ స్టార్..
Nani

Updated on: Jan 31, 2022 | 10:34 AM

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్‏తో వెల్‏కమ్ చెప్పారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singa Roy). ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. వీ, టక్ జగదీష్ లాంటి వరుస ప్లాపుల తర్వాత నానికి సూపర్ హిట్ ఇచ్చింది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో నాని, సాయి పల్లవి జోడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమా తర్వాత నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు న్యాచురల్ స్టార్. అలాగే ప్రస్తుతం నాని.. దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతో నాని మరో ప్రయోగం చేస్తున్నారు. ఇందులో నాని మాస్ లుక్‏లో కనిపించనున్నాడు. కోరమీసం, గుబురు గడ్డంతో మాస్ యాటిట్యూడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతుననారు. ఈ సినిమా కథాంశం పూర్తిగా పల్లె నేపథ్యంలో ఉండనుందట. తెలంగాణంలోని సింగరేణి బొగ్గుగని ప్రాంతంలోని ఓ పల్లెటూరి కథని.. ఇందులో నాని బొగ్గు గని కార్మికుడిగా కనిపించనున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇక ఆగస్ట్ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లగా తెలుస్తోంది.

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

Loading...
Unable to load recommendations.
Follow Us