సినిమా ఇండస్ట్రీలో ఫాంటసీ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇప్పటికే చాలా సినిమాలు ఫాంటసీ స్టోరీలతో తెరకెక్కి మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు మోహన్ లాల్ ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్నారు. మోహన్‌లాల్ నటిస్తున్న బరోజ్ ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కానుంది. బరోజ్ అనేది పిల్లల సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు మూవీ టీమ్. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారని అంటున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
బరోజ్ , గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్ పేరుతో ఈ సినిమా 3డిలో తెరకెక్కుతుంది. రూ.కోటి వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మలయాళంలో బరోస్ అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది. మోహన్‌లాల్ టైటిల్ క్యారెక్టర్‌లో నటించిన బరోజ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. బరోజ్ మేకింగ్‌లో మోహన్‌లాల్ మలయాళ సినిమా శైలినిచూపించారు.
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఆంథోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కిలియన్, లిడియన్ నాదస్వర సంగీతం సమకూర్చారు. బి అజిత్ కుమార్ ఎడిటింగ్ చేసారు. జిజో పున్నూసిన్ స్క్రీన్ ప్లే, కలవూరు రవికుమార్ డైలాగ్స్ సిద్ధం చేశారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న విడుదల చేయాలని నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. విదేశాలను కలుపుకొని చెన్నై, బ్యాంకాక్, గోవాలో కూడా చిత్రీకరణ జరిగింది. జూలై 29, 2022న షూటింగ్ ముగిసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సౌండ్ మిక్సింగ్ జరిగింది. తొలి ప్రయత్నంగా మార్చి 2023లో విడుదల చేయాలనుకున్నారు. అది జరగలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.