Mohan Babu Alitho Saradaga: విలన్‌గా 400కి పైగా చిత్రాలు, హీరోగా 150కి పైగా చిత్రాలు, నిర్మాతగా 60 చిత్రాలు, విద్యా వేత్తగా కీర్తి ప్రతిష్టతలు మోహన్ బాబు గురించి చెప్పాలంటే ఈ విషయాలన్నీ చెప్పాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటుల్లో మోహన్ బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బహుశా ఈ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం సినిమాలతోనే కాకుండా తన ముక్కుసూటి తనం, గంభీరమైన గొంతుతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు మోహన్ బాబు. ఇదిలా ఉంటే మోహన్ బాబు అంటే చాలా రఫ్‌గా కనిపిస్తారు. తప్పును ఉపేక్షించరు, ఎప్పుడూ గంభీరంగా మాట్లాడుతారు.. బయట నుంచి చూసే వారికి ఇవే కనిపిస్తాయి. కానీ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఈ స్టార్ హీరో.
తాజాగా నటుడు ఆలీ వ్యాఖ్యాతగా నిర్వహించే ‘ఆలీతో సరదాగా’ టాక్‌షోలో పాల్గొన్నారు మోహన్ బాబు. ఈ షో 250వ స్పెషల్ ఎపిసోడ్‌లో మోహన్ బాబు పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు కాస్త ఎమోషన్‌కు గురైనట్లు కనిపిస్తోంది. ‘గతాన్ని నెమరువేసుకుంటే తెలయని దుఃఖం వస్తుంది.. నేను ఎంత రఫ్‌గా కనిపిస్తానో అంతకంటే చాలా సెన్సిటివ్, తట్టుకోలేను’ అంటూ ఎమోషన్ అయ్యారు.
ఆర్జీవీది ఒక దారి.. మీది ఒక దారి.. ఈ రెండు దారులు ఎలా కలిశాయి అని ఆలీ అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు బదులిస్తూ.. ‘టెక్నిషియన్‌గా అతనికి హాట్సాఫ్ చెబుతాను. వ్యక్తిగతం అంటావా.. మనం మాట్లాడలేం’ అని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. మరి మోహన్ బాబు జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన చెప్పిన విశేషాలు తెలియాలంటే షో టెలికాస్ట్ అయ్యే వరకు (సోమవారం) వేచి చూడాల్సిందే.
Also Read: RGV Photos: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆర్జీవీ కొన్ని ఆసక్తికర ఫోటోలు…