AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meghamsh Srihari : నాన్న‌లానే న‌న్ను కూడా ఆశీర్వదించండి: శ్రీహరి తనయుడు శ్రీహ‌రి

తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసి తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత నటుడిగా మెప్పించారు. హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు నటుడు శ్రీహరి .

Meghamsh Srihari : నాన్న‌లానే న‌న్ను కూడా ఆశీర్వదించండి: శ్రీహరి తనయుడు శ్రీహ‌రి
Meghamsh Srihari
Rajeev Rayala
|

Updated on: Aug 15, 2026 | 9:18 PM

Share

తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు శ్రీహరి. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా సత్తా చాటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయిన శ్రీహరి ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు శ్రీహరి. ఆయన మరణం తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు ఆగ‌స్ట్ 15 శనివారం శ్రీహ‌రి జ‌యంతి. ప్ర‌తీ ఏడాదిలాగానే ఆయ‌న జ‌యంతిని బాచుప‌ల్లిలోని మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఇది కూడా చదవండి : ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు

ఇదే ప్రాంతంలోనే శ్రీహ‌రి కుమార్తె అక్ష‌ర స్మార‌క ప్రాంతం కూడా ఉంటుంది. శ్రీహ‌రి జ‌యంతి నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో శాంతి శ్రీహ‌రి, హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. హీరో మేఘాంశ్ శ్రీహ‌రి మాట్లాడుతూ ‘‘ఈరోజు నాన్న‌గారి 62వ బ‌ర్త్ డే. ఆయ‌న జ‌యంతిని నిర్వ‌హించాం. ఈ మండ‌పంలోనే చెల్లి అక్ష‌రకు చెందిన స్మార‌కం కూడా ప‌క్క‌నే ఉంటుంది. నాన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నేను న‌టించిన ఆస్మాన్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. నాన్న‌గారికి అంద‌రూ ఆశీర్వ‌దించిన‌ట్లే న‌న్ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. అంద‌రికీ విష్ యు హ్య‌పీ ఇండిపెండెన్స్ డే’’ అన్నారు.

ఇది కూడా చదవండి : దొరికేసింది మావ..! అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా..

శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ ‘‘ఈరోజు బావ‌(శ్రీహ‌రి) 62వ పుట్టిన‌రోజు. ఆయ‌న ఈరోజు మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఎప్ప‌టికీ మ‌న హృద‌యంలోనే ఉంటాడు. అలాగే అంద‌రికీ సాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us