Manchu Vishnu: ‘నీ మీద గౌరవం పెరిగిందన్నా’.. ఉగ్రదాడి బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు

ఓవైపు మా అధ్యక్షుడిగా. మరో వైపు హీరోగా బిజి బిజీగా ఉంటోన్న మంచు విష్ణు తన సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇప్పటికే తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న ఈ మంచు వారబ్బాయి వాళ్లందరికీ కనీస అవసరాలైన విద్య, నిత్యావసరాలు సమకూరుస్తున్నాడు

Manchu Vishnu: నీ మీద గౌరవం పెరిగిందన్నా.. ఉగ్రదాడి బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
Manchu Vishnu

Updated on: May 03, 2025 | 11:29 AM

ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు ఏపీ వాసులు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధు సూధన్ అనే వ్యక్తి విహార యాత్రకు కశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో కన్ను మూశాడు. దీంతో అతని కుటుంబం ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మధుసూదన్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు. మధుసూదన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇక జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. తాజాగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు మధు సూదన్ కుటుంబాన్ని కలిశారు. శుక్రవారం (మే 02) నెల్లూరు జిల్లా కావలి వెళ్లిన అతను మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొదట మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించాడు విష్ణు. అనంతరం సతీమణి కామాక్షి, పిల్లలకు ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. మధు సూదన్ పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, వారిని దత్తత తీసుకుని చదువుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా మధుసూదన్ గత 12 సంవత్సరాలుగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు తిరుపాలు, పద్మావతి, కావలిలో అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కాగా ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు.
పిల్లలకు అవసరమైన విద్య, వసతి, నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇప్పుడు పహల్గామ్ దాడి బాధిత కుటుంబానికి కూడా దత్తత తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు మంచు విష్ణును అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తో మంచు కుటుంబీకులు..

 

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.