Mahesh Babu: అభిమానులకు మహేష్ బాబు రిక్వేస్ట్.. ప్లాస్మా దానం చేయాలంటూ ట్వీట్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా భయానక పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు

Mahesh Babu: అభిమానులకు మహేష్ బాబు రిక్వేస్ట్.. ప్లాస్మా దానం చేయాలంటూ ట్వీట్..

Updated on: Apr 24, 2021 | 2:09 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా భయానక పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కొల్పోతుండగా.. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రాలు ప్రభుత్వాలు.. ఒకవైపు వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమం జరుపుతూనే.. మరోవైపు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఇక కేవలం కరోనాతో మాత్రమే కాకుండా.. ఆక్సిజన్ అందుబాటులో లేక ఎంతోమంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసి సజ్జనార్ తన ట్విట్టర్ పేజీలో కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను డోనేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వీడియోను రీట్వీట్ చేశారు.

సీపీ సజ్జనార్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో ప్లాస్మా డోనేట్ చేయాలంటూ.. అభిమానులకు పిలుపినిచ్చారు. కరోనాతో పోరాడుతున్నవారికి మన నుంచి సహయం చేద్దాం. గతంలో కంటే.. ప్రస్తుతం ప్లాస్మా డోనేటర్స్ అవసరం ఉన్నారు.. అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల మహేష్ వ్యక్తిగత స్టైలీస్ట్ కరోనా బారిన పడడంతో మహేష్ తన కుటుంబసభ్యులతో కలిసి గత కొన్ని రోజుల గత కొన్నిరోజుల నుంచి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

ట్వీట్..

Also Read: ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..

PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..