సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాకు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే మహేష్ లుక్స్, సాంగ్స్ విడుదలకు ముందే లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే లీకైన ఆ రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి ఈ సినిమా నుంచి మరో సాంగ్ లీకైంది. సర్కారు వారి పాట సినిమా నుంచి మూడో పాట టైటిల్ సాంగ్‌ను ఈ నెల 23న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. దీనికి ‘ఈసారి స్పీకర్లు పగిలిపోవాలే’ క్రేజీ క్యాప్షన్‌ని కూడా జోడించారు. అయితే ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
సర్కారు వారి పాట నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మహేష్ స్టిల్స్ నెట్టింట్లో ప్రత్యేక్షమయ్యాయి. మ.. మ.. మహేష్ అంటూ ఈ సాంగ్ మొదలు కానుందని.. ఈ పాటతో సూపర్ స్టార్ అభిమానులను ఆకట్టుకోనుందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. ఈ పాటలో మహేష్ ఊర మాస్ లుక్కులో కనిపించనున్నాడని.. పూల పూల చొక్కా.. లుంగీ.. కళ్లజోడుతో మాస్ స్టెప్పులు వేయబోతున్నాడట.. అయితే ఇలా మరోసారి మహేష్ లుక్ లీక్ కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి సర్కారు వారి పాట సినిమా విషయంలో జరుగుతున్న ఈ లీక్స్ పై జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ లుక్.. సర్కారు వారి పాట మూడో పాటలోనిదే అని తెలియాలంటే ఏప్రిల్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.
Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..
Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..
RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్ స్క్రీన్‌పై ట్రిపులార్ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?