Vijay Sethupathi: తమిళనాడులో వివాదంగా మారుతున్న విజయసేతుపతి ఫై దాడి ఘటన .ఒక నటుడుని ఇంకో నటుడు ఎందుకు కొట్టాడు.. నిజంగానే విజయ్ సేతుపతి దేశాన్ని కించపరిచేలా,మాట్లాడారా.. బెంగళూరు విమానాశ్రయంలో నటుడు విజయ్ సేతుపతి దాడి ఫై వివరణ ఇచ్చిన నటుడు మహా గాంధీ. అసలు ఏం జరిగిందంటే..
నటుడు మహా గాంధీ , తమిళంలో విలన్ గా దాదాపు పదికి పైగా సినిమాలో నటించాడు . ఈ క్రమంలో నటుడు విజయ్ సేతుపతి దాడి ఫై వివరణ ఇస్తూ.. నేను, విజయ్ సేతుపతి ఒకే విమానం లో వచ్చాము, జాతీయ అవార్డు ( దేశీయ అవార్డు ) సాధించినందుకు కృతజ్ఞతలు చెప్పాను. విజయసేతుపతి చాల పొగరుగా ఇదొక దేశమా అని కించపరిచారు ,నేను ముత్తురామలింగ దేవర్ భక్తుడిని , ఆయనగురించి అడిగిన అయన ఎవరు అంటూ,కించపరిచారు ,నేను ఒక నటుడిగా అయన నటనకు అభిమానిని కానీ అయన నన్ను పలకరించిన విధానం చాల అవమానకరంగా ఉంది . ఆ కోపం తోనే ఆయనపై దాడి చేశాను ,ఆతరువాత పోలీస్ స్టేషన్లో మాట్లాడి మమ్మల్ని పంపించేశారు . నేను చేసింది తప్పెఐన అయన మాట్లాడిన తీరు ఈ వివాదానికి కారంణం అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ కి వివరణ ఇచ్చిన మహా గాంధీ .
ఈ వివాదం ఫై స్పందించిన హిందుమక్కల్ కట్చి అధినేత అర్జునసంపత్ . నిజం గానే విజయ్ సేతుపతి ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటే అయన ఫై జరిగిన దాడిని మేము సమర్థిస్తునాం . ఒక జాతీయ అవార్డు తీసుకున్న నటుడు దేశం గురించి ,అందరూ గౌరవంగా భావించే డెన్వర్ అయ్యా గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు .తక్షణమే విజయ్ సేతుపతి దీనిపై వివరణ ఇవ్వాలి , ఇటువంటి వ్యాఖ్యలు చేసుంటే వెంటనే క్షమాపణ చెప్పి జాతీయ అవార్డుని తక్షణమే తిరిగి ఇవ్వాలని అర్జున్ సంపత్ డిమాండ్ .
ఈ వివాదం ఫై విజయ్ సేతుపతి అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చ , తమ అభిమాన నటుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయరని , కావాలనే అయన పేరు చెడగొట్టాలనే ఈ విధంగా మహా గాంధీ మాట్లాడుతున్నారని, అనవసరమైన వివాదాల్లోకి తమ నటుడుని లాగుతున్నారని ఈ వివాదం సర్దుమణగాలంటే విజయ్ సేతుపతి వివరణ ఇవ్వాల్సిందే అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరీ చూడాలి విజయ్ సేతుపతి ఎటువంటి సమాధానం చేబుతారో ..
మరిన్ని ఇక్కడ చదవండి :