సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాలంటే.. బ్యాక్‌గ్రౌండ్ ఉండి తీరాల్సిందే. అలాంటిదేమి లేకుండా.. తమ నటనతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటులు కొందరు మాత్రమే. అందులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకరు. “రాజావారు రాణిగారు” సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత యంగ్ హీరోకు సైలెంట్‌గానే వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే “ఎస్ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసిన కిరణ్.. ఆ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాకు శ్రీధర్ గాదె దర్శకత్వం అందించగా.. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మించగా.. ఆగస్టు 6న విడుదల కానుంది. గురువారం (జూలై 15న) తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చేశానన్నారు కిరణ్. ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని… ఓ తండ్రి, కొడుకుల కథే ఇదని కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ‘ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఖుషీ, పోకిరి’ వంటి చిత్రాలు చూసేటప్పుడు ప్రేక్షకుల్లో ఓ వైబ్రేషన్ ఉండేది.. అలాంటి వైబ్ స్ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నేనే రాశాను. నేను నటించిన ‘సెబాస్టియన్’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సమ్మతమే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ బ్యానర్లో ఓ సినిమా చేయనున్నాడు.