ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‏న్యూస్.. కోమరం భీం గురించి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..

|

May 19, 2021 | 7:28 PM

RRR Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' టీం మేకర్స్ శుభవార్త అందించారు. కోమరం భీమ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‏న్యూస్.. కోమరం భీం గురించి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..
Ntr
Follow us on

RRR Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ టీం మేకర్స్ శుభవార్త అందించారు. కోమరం భీమ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. ఇందులో యంగ్ టైగర్ కోమరం భీంగా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే హీరోహీరోయిన్ల పుట్టిన రోజులకు ఈ మూవీ గురించి స్పెషల్ సర్ ఫ్రైజ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన హీరోహీరోయిన్లు ఫస్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఇవ్వనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

రేపు ఉదయం 10 గంటలకు కోమరం భీంకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని విడుదల చేయబోతున్నాం. దయచేసి అభిమానులంతా రేపు ఇళ్లలోనే ఉండండి. బయటకు వచ్చి పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు అంటూ ట్విట్ చేసింది. అయితే నిన్న ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కరోనా కాలంలో తన బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించవద్దని, దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రతి ఒక్కరు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అయితే గత కొన్ని రోజుల క్రితం తారక్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హోం క్యారంటైన్‏లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్విట్..

Also Read: వాళ్ళకే మీరు సాయం చేస్తారా ? నెటిజన్ ప్రశ్నకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్.. పొలిటిషియన్‏ను కాదంటూ ఫైర్..

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మధురమైన గాత్రం.. గమ్మత్తైన గమకాలతో పాటకు ప్రాణం పోస్తాడు.. మ్యూజిక్ లవర్స్‏కు మోస్ట్ వాంటెడ్ సింగర్‏గా సిధ్ శ్రీరామ్