నా భార్యే నన్ను చంపాలనుకుంది.. 8నెలలుగా ఆ డ్రింక్ ఇచ్చి.. షాకింగ్ విషయం చెప్పిన హీరో

ఒకప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే తన ముక్కుసూటి తనంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఒకప్పుడు బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

నా భార్యే నన్ను చంపాలనుకుంది.. 8నెలలుగా ఆ డ్రింక్ ఇచ్చి.. షాకింగ్ విషయం చెప్పిన హీరో
Tollywood News

Updated on: Dec 12, 2025 | 12:23 PM

ఆయన ఓ స్టార్ హీరో.. తెలుగులో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి ఆతర్వాత హీరోగా మారాడు. తన నటనతో యువతను కట్టిపడేశాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన పై హత్య ప్రయత్నం చేశారు అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఎనిమిది నెలలుగా తనకు కాషాయం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చారని దాని వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది అని తెలిపాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?

ఒకప్పుడు యువతను ఆకట్టుకున్న హీరోల్లో జేడీ చక్రవర్తి ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు జేడీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. తన జీవితంలో ఒక షాకింగ్ ఘటన జరిగిందని చెప్పారు.  చాలా దగ్గర వ్యక్తి ద్వారా జరిగిన స్లో పాయిజన్ సంఘటన గురించి అయన షాకింగ్ విషయాలు చెప్పారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. గతంలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డాను. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు. తన స్నేహితుడు ఉత్తేజ్ అనేక మంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారని, అలాగే కిమ్స్, రెయిన్‌బో హాస్పిటల్స్‌లోని నిపుణులను సంప్రదించినా ఏం తెలియదు. ఇండియా, శ్రీలంకలోని వైద్యులను కూడా కలిసినా ఎవరూ తన సమస్యను గుర్తించలేకపోయారు అని అన్నారు.

అలాగే డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి అలవాట్లు లేనప్పటికీ తనకు శ్వాస సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలియక అయోమయంలో  పడ్డాను అన్నారు. ఆ క్లిష్ట సమయంలో ఆయన స్నేహితుడు, లాయర్ అయిన శేషు (ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నిర్మాత) అండగా నిలిచారని. శేషు తనను డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లారని తెలిపారు. డాక్టర్ నాగార్జున కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, జేడీ చక్రవర్తికి గత ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం పాటు స్లో పాయిజన్ ఇస్తున్నారని చెప్పారట.. దాంతో షాక్ అయ్యాను అని అన్నారు. ఓ రోజు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టపడ్డాను.. సరిగ్గా ఒకరోజు ఉదయం 4:30 గంటల సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను.  ఆ సమయంలో తన తల్లి ఆస్తమా కోసం ఉపయోగించే ఇన్హేలర్‌ను ఇచ్చిందని, అది ఆయన శ్వాస సమస్యకు ఉపశమనం కలిగించిందని చెప్పారు. అయితే  తాను తాగిన కాషాయం ఒకరోజు తన స్నేహితుడు ఖాసింకు ఇవ్వగా, అతడు రెండు రోజులు జ్వరంతో బాధపడి వాంతులు చేసుకున్నాడని.. తన శరీరంలో చెడు అలవాట్లు లేకపోవడం వల్ల శరీరం విషాన్ని స్వీకరించిందని, ఖాసింకు అలవాట్లు ఉండటం వల్ల శరీరం ఆ విషాన్ని తీసుకోలేక వాంతులు జ్వరం వచ్చిందని సరదాగా చెప్పారు జేడీ చక్రవర్తి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి. తనకు విషం ఇచ్చింది ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.  అయితే తనకు విషం ఇచ్చింది.. తన భార్యే అని టాక్ వినిపిస్తుంది. దీని పై క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి