ఐటమ్‌ గాళ్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న గోవా బ్యూటీ..! మూడేళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి..

| Edited By: Ravi Kiran

Aug 17, 2021 | 2:10 PM

Ileana: దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఇలియానా. టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది.

ఐటమ్‌ గాళ్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న గోవా బ్యూటీ..! మూడేళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి..
Actor Ileana
Follow us on

Ileana: దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఇలియానా. టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకు పోయింది. తెలుగులో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఈ గోవా బ్యూటీ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత ఆమె బరువు పెరగడం, ప్రేమ విఫలం అవ్వడం ఇలా వరుసగా జరిగిపోయాయి. దీంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత కోలుకొని పాత ఇలియానాలా మారింది.

తాజాగా ఇలియానా మరోసారి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.‘పోకిరి’ వంటి కమర్షియల్‌ చిత్రాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందీ గోవా బ్యూటీ. తెలుగులో ‘దేవదాసు’, ‘రాఖీ’, ‘జల్సా’, ‘కిక్‌’, ‘జులాయి’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. అయితే 2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అలా కొంతకాలం పాటు టాలీవుడ్‌కు దూరమైంది. బాలీవుడ్‌లో అడపాడడపా సినిమాలు చేస్తూ వస్తోంది.

2018లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె మరోసారి తెలుగు తెరకు దూరమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె రెండోసారి ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. రవితేజ హీరోగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఇలియానా ఒక ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుందట. దీని ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించాలని ఆశిస్తోందని తెలుస్తోంది.

అయితే మాస్ మాహారాజ రవితేజ ఒకవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తూనే మరోవైపు రామరావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో వేణు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లుగా సమాచారం.

Shruti Hassan: ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతీహాసన్.

Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ మీదికి ఎగబడ్డ జనాలు.. ఊకో కాకా అన్న ఊరుకోలేదు.. అసలేమైందంటే..

Adah Sharma: మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మ అదా శర్మ.. మరోసారి నెటిజన్ల మనసు దోచేసింది.. ఇంతకూ ఏం చేసిందో తెలుసా..