
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో హర్షవర్ధన్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా ఆయన మంచి రచయిత. దర్శకుడు కూడా. ఆ మధ్యన సుధీర్ బాబుతో కలిసి మామా మశ్చీంద్ర సినిమాను తెరకెక్కించింది ఈయనే. సినిమా పెద్దగా ఆడకున్నా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ట్రై చేశాడని ప్రశంసలు అందుకున్నాడు హర్షవర్దన్. ప్రస్తుతం నటుడిగా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారీ సీనియర్ నటుడు. ఇటీవల సంక్రాంతికి వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు హర్షవర్దన్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసినప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు.
‘పవన్ కల్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమాలో కేవలం ఒక్క సీన్ లో మాత్రమే నటించాను. కానీ గుడుంబా శంకర సినిమాకు నేను రైటింగ్ టీమ్ లో పనిచేసాను. అప్పుడు నేను సీరియల్స్ కి రాస్తున్నాను. అమృతం చేస్తున్నాను. నా వర్క్ నచ్చి నాగబాబు గారు తీసుకున్నారు. సినిమాలకు ట్రై చేయమని నన్ను ప్రోత్సహించారు. ఆయనే మొదటి ఛాన్స్ కూడా ఇచ్చారు. ఏదైనా చిన్న సినిమాకు ఛాన్స్ ఇస్తారేమో అనుకున్నా. ఒక రోజు పిలిచి కల్యాణ్ బాబు సినిమాకు పనిచేయాలి అన్నారు. అందులో భాగంగానే బెంగుళూరు ఫామ్ హౌస్ లో కల్యాణ్ బాబు గారితో కూర్చొని సుమారు వారం రోజుల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఆయనతో అలా వారం రోజులు మర్చిపోలేని ట్రావెల్ చేశాను. ఇది జరిగిన చాన్నాళ్ల తర్వాత గబ్బర్ సింగ్ లో చిన్న పాత్రలో నేను నటించాను అప్పుడు సెట్ లో ఆయన గుర్తుపెట్టుకొని పిలిచి బాగున్నావా అంటూ పలకరించారు. ఇన్నేళ్లయినా గుర్తున్నానా ఆయనకు అని ఆశ్చర్యపోయా’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు హర్ష వర్దన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.